
Nara Lokesh: సినిమాల్లో నందమూరి బాలయ్య డైలాగులు గంభీరంగా ఉంటాయి.. రియల్ లైఫ్ లో ఆయన మాట్లాడే మాటలు దబిడి దిబిడి గా ఉంటాయి. అదేంటో గాని ఆ గ్రాంథిక భాషకు నోరు సరిగా తిరగకపోవడం వల్ల నత్తి కనిపిస్తుంది. ఫలితంగా వేరే అర్థం ధ్వనిస్తుంది. ఆ మధ్య ఎన్నికల ప్రచారంలోసారే జహాసా అచ్చా అని చెప్పబోయి బుల్ బుల్ అని అలవోకగా అనేశాడు. ఫలితంగా నవ్వుల పాలయ్యాడు. కొద్దిరోజుల పాటు ఆ బుల్ బుల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇక లోకేష్ కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఎంతైనా మేనమామ, పిల్లనిచ్చిన మామ కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు.. అందుకే వివిధ ప్రెస్ మీట్ లలో బాలయ్య చెప్పిన డైలాగులు చెబుతున్నాడు.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ వల్లె వేశాడు లోకేష్. నా బయోడేటాలోనే భయం లేదని చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వారు.. దాన్ని కవర్ చేసేందుకు లోకేష్ ఏమ్మా సాక్షి వాళ్ళు రాలేదా అంటూ డైవర్ట్ చేసాడు.
ఇక లోకేష్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తన తెలుగును మెరుగుపరుచుకునేందుకు ఏకంగా ఒక తెలుగు అధ్యాపకుడిని నియమించుకున్నాడు.. అతడికి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం కూడా ఇచ్చాడు.. కొంతలో కొంత మెరుగుపడింది కానీ.. ఒక్కోసారి ఆ నోరు తిరగక తను మాట్లాడే మాటల్లో వేరే అర్థం ధ్వనిస్తోంది.. ఫలితంగా అక్కడున్నవారు నవ్వుకుంటున్నారు.. లోకేష్ ఇక మారడా అని… ఈమధ్య ఏదో గిల్లుడు అని మాట్లాడితే.. దీనికి వల్లభనేని వంశీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఏంటి లోకేష్ గిల్లడం కూడా రాదా అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో టిడిపి క్యాంప్ సైలెంట్ అయిపోయింది. పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతున్న ప్రతి మాటకు వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది.. పాపం దీనివల్ల టిడిపి నవ్వుల పాలవుతోంది.

ఆ మధ్య నగరిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు రోజాను డైమండ్ రాణి అని సంబోధించాడు.. జబర్దస్త్ ఆంటీ అని కూడా పిలిచాడు. దీంతో రోజా తోక తొక్కిన తాచులాగా లేచింది. నన్ను ఆంటీ అని పిలుస్తున్నావు, మరి మీ అమ్మ హెరిటేజ్ పాలు అమ్ముతుంది, ఆమెను మిల్క్ ఆంటీ అని పిలవచ్చా అని కౌంటర్ ఇచ్చింది.. పాపం దీనికి లోకేష్ కు నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాలేదు. బలమైన పీఆర్ ఏర్పరచుకున్నప్పటికీ.. లోకేష్ ఎందుకనో తత్తర పాటుకు గురవుతున్నాడు. వచ్చిరాని భాష మాట్లాడి నవ్వుల పాలవుతున్నాడు.. ఇక ఇవి అసలే సోషల్ మీడియా రోజులు కాబట్టి వైసీపీ నాయకులు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.. లోకేష్, టిడిపి నాయకులను ఒక ఆట ఆడుకుంటున్నారు.