Nagarjuna past incident: అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన హీరోలందరు వాళ్ళ సత్తా చూపిస్తూ స్టార్ హీరోలుగా అవతరిస్తున్నారు… ఇక ఇప్పటివరకు మంచి కాన్సెప్ట్ తో సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు కాబట్టి అక్కినేని హీరోలకు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి ప్రస్తుతం అఖిల్ వరకు ప్రతి ఒక్కరు తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మిగతా హీరోలందరు టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంటే అక్కినేని వాళ్ళు మాత్రం కొంతవరకు వెనుకబడిపోయారు… దాంతో వాళ్ళు ఇప్పుడు భారీ విజయాలను సాధించుకోవాల్సిన అవసరమైతే ఉంది… నాగార్జున తన ఎంటైర్ కెరియర్ లో డిఫరెంట్ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే తన వందో సినిమాని తమిళ్ డైరెక్టర్ తో చేస్తున్నాడు. నాగార్జున హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా తన సత్తా చాటుకున్నాడు. కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేసి స్టార్ ప్రొడ్యూసర్ గా కూడా అవతరించాడు… ఇక షూటింగ్స్ ఉన్నప్పుడు నాగార్జున షట్ టైమ్ కి వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాడు అంటూ నాగార్జున గురించి చాలా మంది దర్శకులు చాలా గొప్ప గా చెబుతుంటారు.
ఇక షూటింగ్ స్పాట్ లో ఏదైనా ఇబ్బంది జరిగిన కూడా నాగార్జున తనే ఆ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారట…అందులో భాగంగానే నాగార్జున ఒకరోజు మాస్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఒక 12 సంవత్సరాల అమ్మాయి (జూనియర్ ఆర్టిస్ట్) అనుకోకుండా కొంచెం ఎత్తు నుంచి కింద పడిపోతుంటే ఆయన పట్టుకునే ప్రయత్నం చేశారట…
తను పట్టుకునే లోపే ఆ అమ్మాయి కింద పడిపోవడంతో కాసేపటి దాకా నాగార్జునకి ఏం జరిగిందో అర్థం కాలేదట. మొత్తానికైతే ఆ అమ్మాయికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయట. రెండు రోజులు రెస్ట్ తీసుకొని సెట్ అయిపోయింది. ఆ అమ్మాయి హాస్పిటల్ బిల్లు కూడా నాగార్జున నే చెల్లించాడట. ఆ అమ్మాయి నాగార్జునకు థాంక్స్ కూడా చెప్పిందట.
అయినప్పటికి నాగార్జునకి ఆ అమ్మాయి పడిపోవడం చాలా బాధగా అనిపించిందట. ఇప్పటికి తను చేసిన తప్పుల్లో ఏదైనా ఉంది అంటే ఆ రోజు అమ్మాయిని పడిపోకుండా పట్టుకొని ఉంటే బాగుండేది అని తన సన్నిహితుల దగ్గర చెబుతుంటాడట…అప్పటికి నాగార్జున ఆ పాపకి చాలా దూరంగా ఉన్నాడు. కానీ కొంచెం ప్రయత్నం చేసి ఉంటే ఆ అమ్మాయిని పడిపోకుండా పట్టుకునే వాడినని ఆ విషయంలో తను ఇప్పటికి రిగ్రేట్ అవుతుంటడట…