spot_img
Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer-Rashmi combination : సుడిగాలి సుధీర్-రష్మీ కాంబినేషన్ లో 'గజ్జల గుర్రం'... కన్ఫర్మ్ చేసిన...

Sudigali Sudheer-Rashmi combination : సుడిగాలి సుధీర్-రష్మీ కాంబినేషన్ లో ‘గజ్జల గుర్రం’… కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్!

‘Gajjala Gurram’ movie in Sudheer Sudhir-Rashmi combination : హీరోగా సుధీర్ ఫస్ట్ హిట్ కొట్టాడు. గాలోడు మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేరుకుంది. వీకెండ్ ముగిసే నాటికి గాలోడు రూ. 4 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. ఈ చిత్రం రూ. 2 నుండి 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. దీంతో గాలోడు బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల దిశగా పరుగులు తీస్తుంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. సుధీర్-రష్మీ కాంబినేషన్ లో మూవీ చేస్తానని తెలియజేశారు.

 

నిజానికి సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు చిత్రాల్లో హీరోయిన్ గా రష్మీని అనుకున్నారట. డేట్స్ కుదరకపోవడంతో రష్మీ ఆ రెండు చిత్రాల్లో చేయలేకపోయారని రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. అయితే వీరిద్దరి కోసం నా దగ్గర మరో కథ ఉంది. గజ్జల గుర్రం టైటిల్ తో ఒక కథ సిద్ధంగా ఉంది. దాన్ని బౌండెడ్ స్క్రిప్ట్ గా మలిచి సుధీర్-రష్మీ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కిస్తానని రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుందని ఆయన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

తన వద్ద ఉన్న కథలు సుధీర్ కి చక్కగా సరిపోతాయన్న రాజశేఖర్ రెడ్డి, మా ఇద్దరి మధ్య కో ఆర్డినేషన్ కుదిరింది. సుధీర్ మనకంటే అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారని చెప్పుకొచ్చాడు. ఇక సుధీర్-రష్మీ కాంబినేషన్ లో మూవీ చేస్తే చూడాలని వారి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా ఇంటర్వ్యూలలో కలిసి మూవీ ఎప్పుడు చేస్తున్నారన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు గజ్జల గుర్రం మూవీతో ఫ్యాన్స్ కోరిక తీరనుంది. గజ్జల గుర్రం హీరోయిన్ ప్రధానంగా సాగే కథ అని తెలుస్తుంది.

గాలోడు విజయంతో సుధీర్ ఇమేజ్ మరో లెవల్ కి చేరింది. నెక్స్ట్ ఆయన ‘కాలింగ్ సహస్ర’ చిత్రంతో అలరించనున్నారు. హారర్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇకపై సుధీర్ కి హీరోగా ఆఫర్స్ పెరిగే సూచనలు కలవు. సినిమా అవకాశాలు వస్తున్నా బుల్లితెర షోస్ వదలనని సుధీర్ చెప్పడం విశేషం. తనకు కెరీర్ ఇచ్చిన టెలివిజన్ లో కొనసాగుతా అని ఇటీవల వెల్లడించారు. సుధీర్ యాంకర్ గా ”కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్” పేరుతో ఆహాలో ఓ కామెడీ షో ప్రారంభం కానుంది. డిసెంబర్ 2 నుండి ఇది స్ట్రీమ్ అవుతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper