spot_img
Homeట్రెండింగ్ న్యూస్Public Toilets: పబ్లిక్‌ టాయిలెట్ల కింద గ్యాప్‌ అసలు ఎందుకు ఉంటుందో తెలుసా?

Public Toilets: పబ్లిక్‌ టాయిలెట్ల కింద గ్యాప్‌ అసలు ఎందుకు ఉంటుందో తెలుసా?

Public Toilets: టాయిలెట్‌.. ఇప్పుడు అందరి ఇళ్లలో మనకు కనిపిస్తోంది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రతీ ఇంట్లో టాయిలెట్‌ నిర్మించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. తర్వాత గ్రామాలు, పట్టణాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. ఇంత వరకు బాగానే ఉంది. ఇంట్లో లేదా హోటల్‌ గదిలో ఉండే టాయిలెట్‌ తలుపు పై నుంచి కింది వరకు ఉంటుంది. చిన్న గ్యాప్‌ కూడా మనకు కనిపించదు. కానీ, షాపింగ్‌ మాల్స్, థియేటర్లు, ఆస్పత్రులు వంటి పబ్లిక్‌ టాయిలెట్లకు బిగించే డోర్‌ల కింద గ్యాప్‌ ఉంటుంది. డోర్‌ కింద ఖాళీగా వదిలి కనిపిస్తాయి. కొన్నింటికి పైన గ్యాప్‌ ఉంటుంది. మరి ఇలా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం.

= పబ్లిక్‌ టాయిలెట్‌ దిగువన ఉన్న తలుపులు తరచుగా మురికిగా ఉన్న ఫ్లోర్ శుభ్రం చేయడానికి ఇలా ఖాళీగా వదిలేస్తారు. టాయిలెట్‌ లోపలికి వెళ్లకుండానే క్లీన్‌ చేసే అవకాశం ఉంటంది.

= పబ్లిక్‌ టాయిలెట్‌ను చాలా మంది ఉపయోగిస్తారు. దీంతో దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వాసన త్వరగా బయటకు పోవడానికి ఈ ఖాళీ ఉపయోగపడుతుంది.

= టాయిలెట్‌ లోపల ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా జరిగినా, జారిపడినా, హార్ట్‌స్ట్రోక్‌ వచ్చినా.. సులభంగా తెలుసుకునే వీలు ఉంటుంది. లోపలికి గడియ పెట్టి ఉంటుంది కాబట్టి కింద నుంచి లోనికి వెళ్లి రక్షించడానికి కూడా ఖాళీ గ్యాప్‌ ఉపయోగపడుతుంది.

= ఇక ఎక్కువ మంది ఉపయోగించడం వలన.. తలుపుల కింది భాగం తడిసిసోతుంది. ఎక్కువగా తడవడం వలన డోర్లు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.

= పైన ఉన్న ఖాళీ లోపల ఉన్న వ్యక్తి ఏదైనా ఇబ్బందుల్లో లేదా ప్రమాదంలో ఉన్నప్పుడు బయటకు తీసుకురావడానికి, బయట ఉన్న వ్యక్తి లోనికి వెళ్లడానికి ఉపయోగపడుతుంది.

= కింద ఖాళీ ఉండడంతో లోపల వ్యక్తి ఉన్నాడన్న విషయం డోర్‌ కొట్టకుండానే తెలుసుకోవచ్చు. డోర్‌ కొడితే లోపల ఉన్నవారికి అసౌకర్యంగా కూడా ఉంటుంది. అందుకే పబ్లిక్‌ టాయిలెట్‌ డోర్ల కింద ఖాళీగా వదిలేస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper