Allu Arjun Arrested: పుష్ప 2 సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్…ప్రస్తుతం పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. అయితే అల్లు అర్జున్ ని గత కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే… ఇక పుష్ప 2 సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే ఆవిడ మృతి చెందారు. ఇక దానికి సంబంధించిన కేసులోనే ప్రస్తుతం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దానికోసం ఆయన మీద 105,118(1), రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద బాన్ బెయిలబుల్ కేసు అయితే ఫైల్ చేశారు… ఇక ఈ కేసు కనక రుజువైతే మాత్రం అల్లు అర్జున్ కు దాదాపు పది సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ కొంతమంది న్యాయ నిపుణులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానిని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే… ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా థియేటర్ దగ్గరికి వెళ్లడం తన అభిమానులకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్న ఆయనకు ఇప్పుడు పోలీసులు పెద్ద సర్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి అరెస్టులు ఉండడం అనేది ఆయనను కొంతవరకు మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పాలి. ఇక పుష్ప 2 సినిమా ఆరు రోజులు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది.
కాబట్టి రీసెంట్ గా సక్సెస్ మీట్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ అరెస్టు అవ్వడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా అల్లు అర్జున్ నిందితుడిగా జైలుకు వెళ్తాడా లేదంటే తన తప్పేమీ లేదని ప్రూవ్ చేసుకొని బయటకు వస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
మరి ఏది ఏమైనా కూడా ఒక ప్రాణాన్ని అయితే బలికొన్నాను అనే ఒక గిల్టీ ఫీల్ అయితే అల్లు అర్జున్ కి ఉంది… కాబట్టి ఆయన తన వంతుగా ఆ కుటుంబానికి 25 లక్షల సహాయాన్ని అందించాడు. మరి ఇప్పటికైనా ఆయనతో పాటు మిగిలిన హీరోలు కూడా ఇలాంటి ఒక ఫంక్షన్స్ కి గాని అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి కానీ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అకస్మాత్తుగా వెళ్లకూడదనే ఒక నిర్ణయానికి వస్తే మంచిదని చాలామంది సినీ ప్రముఖులు సైతం అల్లు అర్జున్ ను ఒక ఉదాహరణగా చూపిస్తూ కొన్ని మాటలైతే చెబుతున్నారు…