
Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద ఒక వీడియో మీద మండిపడ్డారు. మొదటి కలయికలో అమ్మాయితో అనుభవం ఇలా ఉంటుందని అబ్బాయిలు అనుకుంటారు. కానీ రియాలిటీలో అలా జరుగుతుందని, అర్థం వచ్చేలా ఒక రీల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. తొలి కలయిక రోజు అమ్మాయి యోని బిగుతుగా ఉండాలని, కన్నెపొర చిరిగి రక్తం రావాలని కొందరు అపోహ పడుతుంటారు. అది నిజం కాదు. వాస్తవంలో ఒక అమ్మాయి యోని బిగుతుగా తయారై శృంగారానికి ఇబ్బందిగా ఉంటే… దాన్ని సమస్యగా భావించాలి .
కొందరు పోర్న్ వీడియోలు చూసి ఈ అభిప్రాయానికి వస్తున్నారు. ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి. అలాంటి వాళ్లకు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అవసరం. ఒక అమ్మాయి ఇలాంటి విషయాలు మాట్లాడమేంటని మీరు అనుకోవచ్చు. తప్పు లేదు. ఇది మాట్లాడాల్సిన అంశం. అవగాహన కల్పించాల్సిన విషయం. గుడ్డిగా ఒక అమ్మాయి వర్జినా? కాదా? అనేవి నిర్ణయించ వద్దంటూ ఆమె గట్టిగా చెప్పారు.

సింగర్ చిన్మయి శ్రీపాద తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. శృంగారం గురించి ఆమె పచ్చిగా మాట్లాడేశారని కొందరు భావిస్తున్నారు. చిన్మయి కరుడుగట్టిన స్త్రీవాది అని చెప్పొచ్చు. తన కెరీర్ కూడా పణంగా పెట్టి ఆమె మీటూ ఉద్యమం చేస్తున్నారు. స్టార్ రైటర్ వైర ముత్తు మీద ఆమె అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అతనిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కారణంగా సింగర్ చిన్మయి కోలీవుడ్ లో కెరీర్ కోల్పోయారు. దేశంలో ఏ మూలన స్త్రీకి అన్యాయం జరిగినా స్పందిస్తారు.
చిన్మయి గతంలో సమంతకు డబ్బింగ్ చెప్పేవారు. సమంత నటించిన అన్ని చిత్రాలకు దాదాపు ఆమెనే డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ మధ్య సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. యశోద, శాకుంతలం చిత్రాల్లో తన ఓన్ వాయిస్ వాడుకున్నారు. దీనిపై చిన్మయి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇకపై సమంతకు నేను గొంతు అరువిచ్చే అవకాశం రాకపోవచ్చన్నారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్ర చిన్మయి భర్త కావడం విశేషం.
View this post on Instagram