Three Marriages: ఆదరించే మనసు లేనప్పుడు ఆకర్షించే అందమెందుకు అన్నారు. బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యమే మిన్న మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ అభిప్రాయం. మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండు. బయట అందాన్ని చూసి భ్రమిస్తే మనకు కలలే మిగులుతాయి. అందమైన మనసును చూసి మోహిస్తే జీవితం నందనవనం అవుతుంది. అంతే కాని కనిపించే అందానికి ప్రాధాన్యం ఇస్తే కష్టాలు కొనితెచ్చుకోవాల్సిందే. ఎ బ్యూటీఫుల్ వైఫ్ డేంజరస్ లైఫ్ అన్నారు. అందంతో మనం పరుగెత్తడం కాదు ఆ అందమే మనతో పరుగు తీయాలి.
మైసూర్ లోని ఉదయగిరి ప్రాంతానికి చెందిన నిఫా ఖాన్ అందాల రాసి. ఎవరైనా ఒకసారి చూస్తే ఇట్టే మనసు పారేసుకుంటారు. అంతటి అందం ఆమె సొంతం. దీంతో ఆమె తన అందంతో అందరిని మంత్రముగ్దులను చేస్తోంది. యువతను తన వెంట తిప్పుకుంటోంది. ఇటీవల రాజీవ్ నగర్ కు చెందిన అజామ్ ఖాన్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు అవ్వడం గమనార్హం.

ఈ నేపథ్యంలో గతంలో జరిగిన రెండు వివాహాల సంగతి గోప్యంగా ఉంచింది. ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నా రహస్యంగా కాపురం కొనసాగించింది. ఒక్కరి దగ్గర కాదు ముగ్గురితో సరసాలు సాగించింది. ముగ్గురితోనూ మురిపాలు తీర్చుకుంది. అలనాటి ద్రౌపతి వలె బహుభర్తలతో సుఖం పొందుతోంది. అయితే ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ లో బిజీగా ఉండే ఆమె ప్రవర్తనపై మూడో భర్తకు అనుమానం వచ్చింది.
Also Read: AP CM Y S Jagan: ఏపీ సీఎం జగన్ కు షాకిచ్చిన కోర్టు..
ఆమె అందానికి దాసోహమన్న అజామ్ ఆమె తీరుకు అతడిలో అనుమానమే బీజం పెరిగింది. దీంతో ఆమె వ్యవహారంపై ఆరా తీశాడు. చివరకు నిజం తెలియడంతో ఖంగుతిన్నాడు. అందానికి తలొగ్గితే తిప్పలే అని తెలుసుకున్నాడు. ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించాడు. ఇప్పటికైనా తెలుసుకోవాలి. అందంతో చాలా అనర్థాలు, అపార్థాలు వస్తాయని గ్రహించుకోవాలి. బాహ్య సౌందర్యాన్ని చూసి భ్రమిస్తే జీవితంలో కష్టాలే అని తెలుసుకున్నాడు.
Also Read: RRR Story Leaked: బిగ్ బ్రేకింగ్.. ఆర్ఆర్ఆర్ కథ లీక్.. హైలెట్స్ ఇవే