Homeక్రీడలుCSK Captaincy : చెన్నై కెప్టెన్సీ వదిలేసి మరో సారి షాకిచ్చిన ఎంఎస్ ధోని.. కొత్త...

CSK Captaincy : చెన్నై కెప్టెన్సీ వదిలేసి మరో సారి షాకిచ్చిన ఎంఎస్ ధోని.. కొత్త కెప్టెన్ ఎవరంటే?

CSK Captaincy MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. టీంను విజయవంతంగా నడిపించడమే కాదు.. అంతే విజయవంతంగా తన వారసులను ఎంపిక చేస్తుంటాడు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తన శక్తిసామర్థ్యాలు.. ఆడగలనా? లేదా అని అన్ని విషయాలు కూలంకశంగా మధించుకొని టీం భవిష్యత్తు దృష్ట్యా ఏకంగా కెప్టెన్సీని కూడా తృణప్రాయంగా వదిలేస్తుంటాడు. ధోనిని అందుకే అందరూ కర్మయోగి అంటారు. ఫాం ఉన్నప్పుడు టీం కోసమే.. ఫాం కోల్పోయినా టీం కోసమే ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకుంటాడు.

2016లో ఫుల్ ఫాంలో ఉండగా టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు వదులుకొని ఎంఎస్ ధోని క్రీడాలోకాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. అనంతరం విరాట్ కోహ్లీని తన వారసుడిగా ఎంపిక చేసి వన్డే, టీ20 పగ్గాలను అంతే సామరస్యంగా అప్పగించాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఈ నాయకత్వ మార్పును అంత సజావుగా చేయలేదు. తన తర్వాత రోహిత్ శర్మకు అప్పగించేందుకు ఎంతలా వివాదాలు కొనితెచ్చుకున్నాడో చూశాం..

ధోని టీమిండియా పగ్గాలనే కాదు.. ఇప్పుడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని అంతే తృణప్రాయంగా వదులుకొని షాకిచ్చాడు. ఇప్పటికే మొన్నటి ఐపీఎల్ వేలంనాడే ధోని ఈ సంకేతాలు ఇచ్చాడు. చెన్నై తరుఫున 12 కోట్లతో ధోని రెండో స్థానంలో అట్టిపెట్టుకున్నారు. మొదటి స్థానంలో 16 కోట్లు ఇచ్చి జడేజాను టీంలో ఉంచుకున్నారు. ఇలా నాడే కెప్టెన్సీ మార్పు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఐపీఎల్ ముందర అదే నిజమైంది.

2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఎంఎస్ ధోనినే కొనసాగుతున్నారు. చెన్నై అంటే ధోని అన్నంతగా ఎదిగిపోయాడు. అయితే తాజాగా తన వారసుడిని వివాదాల్లేకుండా అప్పగించి మరోసారి అభిమానులను ఫిదా చేశాడు. ఈ మేరకు సీఎస్కే టీం ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read: RRR Movie Ignores Print Media: ఏంటిది జ‌క్క‌న్న‌.. ప్రింట్ మీడియా ఏం పాపం చేసింది.. ఎందుకీ వివ‌క్ష‌..?

ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వాన్ని జడేజాకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. జట్టుకు నాయకత్వం వహించడానికి రవీంద్ర జడేజాను ఎంచుకున్నాడు. 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో అంతర్భాగంగా ఉన్న జడేజా, సీఎస్కేకి నాయకత్వం వహించే మూడవ ఆటగాడు.” అని చెన్నై యాజమాన్యం తెలిపింది. ధోని ఈ సీజన్ తోపాటు వచ్చే సీజన్లకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు” అని ఫ్రాంచైజీ తెలిపింది.

CSK Captaincy MS Dhoni
Ravindra Jadeja

ఇక రవీంద్ర జడేజా చెన్నై తరుఫున అద్వితీయమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. జడేజా బ్యాట్.. బౌల్‌తో ఐపీఎల్ రికార్డును కలిగి ఉన్నాడు. బ్యాటర్‌గా, అతను 63 ఇన్నింగ్స్‌లలో 27.11 సగటుతో 2,386 పరుగులు చేశాడు. మొత్తం 200 లీగ్ మ్యాచ్‌ల్లో 127 వికెట్లు కూడా తీశాడు.

జడేజా గత 14 ఏళ్లలో నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలతో సంబంధం కలిగి ఉన్నాడు. 2008-12 నుంచి రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా ఉన్నాడు. 2012-15 మధ్య కాలానికి రవీంద్రజడేజా సీఎస్కే కొనుగోలు చేశారు. 2016లో గుజరాత్ లయన్స్‌కు వెళ్లి 2018లో సీఎస్కేకి తిరిగి వచ్చాడు.

జడేజా సీఎస్కే కెప్టెన్‌గా ధోని సెట్ చేసిన ఆ అంచనాలు అందుకుంటాడా? ఈ సవాలును అధిగమిస్తాడా? అన్నది వేచిచూడాలి. చెన్నై జట్టు అన్ని ఇతర ఫ్రాంచైజీల కంటే అత్యధికంగా నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన చివరి టోర్నమెంట్ 2021ను ధోని సారథ్యంలోనే గెలుచుకుంది. అలాంటి విజయవంతమైన సీఎస్కేను ధోని వారసుడిగా జడేజా ఎలా నడిపిస్తాడన్నది వేచిచూడాలి.

Also Read: IPL 2022 Tickets Online Booking: ఐపీఎల్ టికెట్లు కావాలా.. ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular