ప్రపంచంలోని చాలా ప్రేమ జంటలు ఒకరినొకరు అమితంగా ప్రేమించుకున్నా కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోవడం వీలు కాదు. ప్రేమికులు విడిపోవడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. అయితే పెళ్లి జరిగే సమయంలో మాజీ ప్రియుడు వచ్చినా మాజీ ప్రియురాలు వచ్చినా పెళ్లి చేసుకునే యువతి / యువకుడు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే ఇండోనేషియాలోని జకర్తాలో మాత్రం వింత ఘటన చోటు చేసుకుంది.
జకర్తాకు చెందిన ఒక యువతి ప్రేమించిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఆ పెళ్లికి వధువు ప్రేమించిన వ్యక్తి హాజరయ్యాడు. వధువు మాజీ ప్రియుడు వధూవరులకు అభినందనలు తెలపడానికి స్టేజ్ పైకి రాగా పెళ్లికి వచ్చిన మాజీ ప్రియుడిని చూసిన వధువు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తరువాత వధువు మాజీ ప్రియుడిని కౌగించుకుంటానని వరుడిని అడిగింది.
ఆమె అలా అడగడంతో అవాక్కైన వరుడు వధువు మాజీ ప్రియుడిని హగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. ఆ తరువాత మాజీ ప్రియుడు వరుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. పెళ్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు వధువును విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉండటం గమనార్హం. వధువు చేసిన పని కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరి కొందరు నెటిజన్లు పెళ్లిరోజే అతని భార్య భర్తను బాధ పెట్టిందని కామెంట్లు చేస్తున్నారు. భర్త అనుమతితో ఇలా హగ్ చేసుకోవడం దారుణం అంటూ మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.