Allu Arjun Arrested: సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ అయితే ఉంది. ఇక ఆయన క్రేజీని వాడుకుంటూ ప్రస్తుతం పుష్ప 2 సినిమాని సూపర్ సక్సెస్ గా నిలిపాడు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన ఒక దుర్ఘటన వలన ఆయనకు చాలావరకు బ్యాడ్ నేమ్ రావడమే కాకుండా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి వచ్చింది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ చేసింది తప్పు అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఆయనకు ఆ ప్రాబ్లం లో ఎలాంటి తప్పులేదు. హీరోగా తన సినిమాని తను ప్రమోట్ చేసుకోవడానికి థియేటర్ కి వచ్చాడు. అక్కడున్న పోలీసులు విఫలం అయ్యారు అంటూ మరి కొంతమంది వాదిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఏ ఇంటిమేషన్ లేకుండా థియేటర్ కి రావడం అనేది కొంత వరకు తప్పనే చెప్పాలి. మరి ఈ సందర్భంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన అభిమానులతో సంతోషంగా గడపాల్సిన సమయాన్ని పోలీస్ స్టేషన్ లో గడపాల్సి వస్తుందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి నేరం రుజువైతే 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్న సందర్భంలో ఆ కేసు నుంచి ఆయన తప్పించుకోడానికి గల ఒకే ఒక్క కారణం కూడా ఉందని మరి కొంతమంది తెలియజేస్తున్నారు.
ఇక న్యాయం నిపుణుల సలహా మేరకు అందుతున్న సమాచారం ఏంటి అంటే తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయమని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ తో వాళ్లు కాంప్రమైజ్ అయినట్లైతే అల్లు అర్జున్ జైలుకెల్లాల్సిన అవసరం లేదంటూ ఇంకొంతమంది న్యాయవ్యాదులైతే చెబుతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ మీద పోలీసులు కూడా న్యూసెన్స్ కేసుని పెట్టారు. కాబట్టి దాని మీద కూడా జైల్ కు వెళ్లే అవకాశం అయితే ఉంది. మరి ఏది ఏమైనా కూడా రేవతి కుటుంబ సభ్యులు కాంప్రమైజ్ అయితే 90% అల్లు అర్జున్ జైలుకు వెళ్లే అవకాశం అయితే ఉండదు. కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకపోతేనే అల్లు అర్జున్ కేసు అనేది కీలక మలుపులు తిరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు..