Allu Arjun Arrested: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన ఘటన ఇప్పుడు ఎంతటి సంచలనం గా మారిందో తెలిసిందే. సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షోని చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ ని చూసి వేలాదిగా అభిమానులు ఎగబడి రావడంతో, తొక్కిసిలాట జరిగింది. ఈ ఘటనలో 39 ఏళ్ళ యువతీ రేవతి మరణించింది. ఆమె పిల్లలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ పిల్లలిద్దరూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రెండు రోజుల తర్వాత స్పందించిన అల్లు అర్జున్, రేవతి మృతి పట్ల సంతాపం ని వ్యక్తం చేసి, ఆమె కుటుంబానికి పాతిక లక్షల రూపాయిల ఆర్ధికసాయం అందించాడు. అంతే కాకుండా ఆమె పిల్లల బాధ్యతలు కూడా తాను తీసుకుంటానని, భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పుకొచ్చాడు. కానీ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ పై FIR నమోదు చేసారు.
బాధ్యతారాహిత్యంగా ఆయన చేసిన పని స్వాగతింపబడినది కాదని, మాకు ముందస్తుగా ఆయన ఎలాంటి సమాచారం అందించలేదని, అయినప్పటికీ కూడా బందోబస్తు ఇవ్వడానికి ప్రయత్నం చేశామని పోలీసులు ప్రెస్ మీట్ ద్వారా తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై అల్లు అర్జున్ తీవ్రమైన పరిణామాలు ఎదురుకుంటాడని తెలుసు కానీ, ఇంత తొందరగా అరెస్ట్ అవుతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ విచారణలో ఆయన దోషం ఉంది అనేది నిరూపణ అయితే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన క్షణంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆయన భార్య స్నేహా రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెని అల్లు అర్జున్ ఓదారుస్తున్న వీడియోని మీరు క్రింద చూడొచ్చు. అదే విధంగా అల్లు అరవింద్ చాల టెన్షన్ పడిన సందర్భాలను కూడా ఆ వీడియోలో మనం చూడొచ్చు.
అల్లు అర్జున్ ని పోలీస్ కారులో ఎక్కిస్తుండగా, అల్లు అరవింద్ కూడా ఆయన వెంట రావడానికి ప్రయత్నం చేసాడు. అప్పుడు పోలీసులు మీకు సంబంధం లేదు కదా సార్, మీరెందుకు వస్తున్నారు, మీరు రావడానికి వీలు లేదని అంటారు. అప్పుడు పక్కనే ఉన్న మరో పోలీసు రానివ్వు అయ్యా, ఆయన తండ్రియే కదా అని అంటాడు. ఆ తర్వాత పోలీసు కారులో కూర్చున్న అల్లు అరవింద్ తో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘మీకు సంబంధం లేని మ్యాటర్ కదా నాన్న, మీరు రావాల్సిన అవసరం ఏమి లేదు, క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి, అది మంచి అయినా, చెడు అయినా’ అంటూ తన తండ్రిని కారు నుండి దింపేస్తాడు. అల్లు అరవింద్ ఈ ఘటన మొత్తంలో విచారకరమైన ముఖాన్ని పెట్టుకొని, టెన్షన్ టెన్షన్ గా ఫోన్లు చేసుకోవడం వంటివి మనం చూడొచ్చు.