Homeఎంటర్టైన్మెంట్Actress Pakeezah Vasuki: తినడానికి తిండి లేదు, ఉండేందుకు గూడు లేదు.... అనారోగ్యంతో రోడ్డున పడ్డ లేడీ...

Actress Pakeezah Vasuki: తినడానికి తిండి లేదు, ఉండేందుకు గూడు లేదు…. అనారోగ్యంతో రోడ్డున పడ్డ లేడీ కమెడియన్ పాకీజా! 

Actress Pakeezah Vasuki: వాసుకి అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పాకీజా అంటే టక్కున గుర్తు పడతారు. ఈ జనరేషన్ ఆడియన్స్ కి ఆమె తెలియదు. 90లలో లేడీ కమెడియన్ గా ఆమె ఒక వెలుగు వెలిగారు. అసెంబ్లీ రౌడీ మూవీలో బాత్రామ్స్ కడితే స్టైలిష్ ఆయా పాకీజా పాత్రతో తెలుగు ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. పాకీజా-బ్రహ్మానందం కామెడీ ట్రాక్ అసెంబ్లీ రౌడీ మూవీలో పెద్ద హైలెట్. రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన పాకీజా ప్రస్తుత పరిస్థితి అత్యంత దుర్భరం. తినడానికి తిండి లేదు. ఆరోగ్యం క్షీణిస్తుంది. దుర్భర పరిస్థితి నడుమ బతుకీడుస్తున్నారు.

Actress Pakeezah Vasuki
Actress Pakeezah Vasuki

చెన్నైలో రోడ్డుపై నిరాడంబరంగా నడిచి వెళుతున్న పాకీజాను ఓ మీడియా ప్రతినిధి చూశారు. గుర్తు పట్టి మీరు పాకీజా కదా… అని అడిగారు. అవును అని వాసుకీ సమాధానం చెప్పారు. రోడ్డుపై నడిచి వెళుతున్నారేమిటీ అని అడిగితే… నేను ప్రస్తుతం చెన్నైలో ఉండటం లేదు. మాది మదురై దగ్గర ఒక గ్రామం. అక్కడకు వెళ్ళిపోయాను. ఒక ఫ్రెండ్ ని కలవడానికి చెన్నై వచ్చాను. ఇక్కడ నాకు ఇల్లు లేదు. హాస్టల్ లో దిగాను. టీ నగర్ వెళ్ళాలి. చెన్నైలో బస్సులు ఉచితం కదా… బస్సు కోసం వేచి చేస్తున్నాను, అన్నారు.

ఏమైనా తిన్నారా? అని అడగ్గా… లేదు టీ తాగి బయలుదేరాను అన్నారు. ముందు భోజనం చేద్దాం పదండి , తర్వాత మాట్లాడుకుందాం అని సదరు ప్రతినిధి ఆమెను ఒక లగ్జరీ హోటల్ కి తీసుకెళ్లారు. మంచి భోజనం చేసి ఆరు నెలలు అవుతుందని పాకీజా చెబుతుంటే గుండెలు తరుక్కుపోయాయి. కూడబెట్టిన ఆస్తులు ఏమీలేవు. అమ్మ క్యాన్సర్ తో చనిపోయిందని వాసుకి చెప్పారు. అయినవాళ్లు పట్టించుకోవడం లేదు. నడిగర్ సంఘం ఉంది కానీ ఎలాంటి సహాయం చేయలేదు.

Actress Pakeezah Vasuki
Actress Pakeezah Vasuki

రజినీకాంత్, ఉదయనిధి స్టాలిన్ తో పాటు పలువురు స్టార్స్ కి నా పరిస్థితి వివరిస్తూ వీడియోలు పెట్టాను. అయినా ఎవరూ స్పందించలేదు. సహాయం చేయడానికి ముందుకు రాలేదు. నాకు షుగర్ వ్యాధి ఉంది. దాని కారణంగా యుటరస్ తీశారని దారుణం పరిస్థితి చెప్పుకొచ్చారు. తెలుగు నటి జయలలిత నాకు ఫ్రెండ్. ఆ రోజుల్లో చెన్నైలో ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఆమెతో కనెక్షన్ పోయింది. నంబర్ మిస్ అయ్యింది. జయలలిత తాను నటించే సీరియల్స్ లో నాకు కూడా వేషాలు ఇప్పించేందుకు ట్రై చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా కలిసి సహాయం గురించి అడగాలని వాసుకి తన వేదన వెలిబుచ్చారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper