Hyundai Cars: కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు మార్కెట్లోకి ఎప్పుడు కొత్త మోడల్ కార్లు వస్తూనే ఉంటాయి. వాటిని వినియోగదారులు కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా రెండు కొత్త వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్, ఆరా వంటి మోడళ్లతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దీంతో ఈ కొత్త వేరియంట్లను దక్కించుకునేందుకు వినియోగదారులు పోటీ పడుతూనే ఉన్నారు. కొత్త ఏడాదిలో కొత్త మోడల్ కార్లను తమ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

హ్యుందాయ్ కంపెనీ 2023 ఆరా, న్యూ గ్రాండ్ ఐ 10 నియోస్ మోడళ్లలో కాస్మటిక్ అప్ గ్రేడ్స్ చేసింది. హ్యుందాయ్ ఆరా కారును 2020 జనవరిలోనే మార్కెట్లోకి తీసుకొచ్చినా ఇప్పుడు కంపెనీ నూతన వెర్షన్ ను ప్రారంభించింది. దీంతో ఆరాను కొనుగోలు చేయాలంటే రూ. 11 వేలతో బుక్ చేసుకోవచ్చని ఆఫర్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు కారును సొంతం చేసుకోవాలని క్యూ కడుతున్నారు. ఆధునిక శైలిలో నిర్మాణమైన ఆరాను కొనుక్కోవాలని ఆరాటపడుతున్నారు.
బుకింగ్ చేసుకున్న తరువాత ఒక నెల వరకు ఆరా కంపెనీ కారు మార్కెట్ లోకి రావచ్చని చెబుతున్నారు. ట్విన్ బూమరాంగ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉన్నాయి. స్లిమ్మర్ అప్పర్ గ్రిల్ తో కారుకు కొత్త లుక్ వచ్చిది. వెనుక భాగంలో జెడ్ షేప్ ఎల్ ఈడీ టెయిల్ లైట్స్ ఉండటం ప్రత్యేకత. కంపెనీ ఇందులో 4 ఎయిర్ బ్యాగులు, ఏబీఎన్, ఈబీడీ స్టాండర్డ్ ఫీచర్లు ఉండటంతో కారు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీంతో దీన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారని చెబుతున్నారు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ లో రీ డిజైన్ అదరగొడుతోంది. వై ఆకారం ఎల్ ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఆటోమేటిక్ హెడ్ ల్యాంపులు, ఏబీఎన్, ఈబీడీ వంటి ఫీచర్లు ఉండటంతో ఈ మోడల్ సీఎన్ జీ ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో కస్టమర్లు దీనికి మొగ్గు చూపుతున్నారు. రూ.11 వేల టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. రేపటి నుంచి ఆటో ఎక్స్ పో 2023 ప్రారంభం అవుతోంది. ఇందులో కార్ల కంపెనీలు వాటి ఫ్యూచర్ కార్లను ప్రదర్శించనున్నాయి.