spot_img
Homeట్రెండింగ్ న్యూస్Aadhaar Card For Dogs: వీధి కుక్కలకు ఆధార్ కార్డులు ఇస్తున్నారు.. ఎందుకో తెలుసా?

Aadhaar Card For Dogs: వీధి కుక్కలకు ఆధార్ కార్డులు ఇస్తున్నారు.. ఎందుకో తెలుసా?

Aadhaar Card For Dogs: ‘ఆధార్‌’ కార్డు.. మనుషుల గుర్తింపు కోసం కేంద్రం తెచ్చిన యూనిక్‌ నంబర్‌. మరి నిత్యం మనుషుల మధ్యే .. మనుషులతోనే కలిసి జీవించే కుక్కల పరిస్థితి ఎలా అనే ఆలోచన ముంబైకి చెందిన ఇంజనీర్‌ అక్షయ్‌ రిడ్లాన్‌ కు వచ్చింది.. దీనికి అక్షయ్‌ ఒక పరిష్కారాన్ని రెడీ చేశారు. ఆధార్‌ కార్డులో మనుషుల వివరాలను, బయో డేటాను, అడ్రస్‌ను ఎలాగైతే ఎంటర్‌ చేస్తారో.. అదే విధంగా వీధి కుక్కల వివరాలతో డిజిటల్‌ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డులను ఇంజనీర్‌ అక్షయ్‌ రిడ్లాన్‌ రెడీ చేశారు.

విమానాశ్రయం వద్ద కుక్కలకు..
ఈ గుర్తింపు కార్డులను తొలి విడతగా ముంబై విమానాశ్రయం పరిసరాల్లో తిరుగుతున్న 20 వీధి కుక్కల మెడలో వేశారు. ఆ కుక్కలు ఉండే ఏరియా వివరాలు, వయసు సమాచారం, సంతానం కలుగకుండా స్టెరిలైజేషన్‌ చేశారా లేదా అనే సమాచారం, టీకాలు వేసిన వివరాలు, కుక్క తప్పిపోయినప్పుడు కాంటాక్ట్‌ చేయాల్సిన ఫోన్‌ నంబర్లు ఈ కార్డులో నమోదై ఉంటాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఒక క్యూఆర్‌ కోడ్‌గా మార్చారు. దీనిని స్కాన్‌ చేస్తే .. కుక్కకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్‌ ప్రత్యక్షం అవుతాయి.

వీధికుక్కల ట్రాకింగ్‌ ఇక సులభం..
ముంబై నగరంలోని వీధి కుక్కలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసేలా త్వరలో లొకేషన్‌ ఆప్షన్‌ను కూడా ఈ ఐడీ కార్డులకు జతపరుస్తామని ఇంజనీర్‌ అక్షయ్‌ రిడ్లాన్‌ వెల్లడించారు. pawfriend.in పేరుతో తాను నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌లో తాము ఐడీ కార్డులు ఇష్యూ చేసిన వీధి కుక్కల వివరాలు పొందుపరిచామని పేర్కొన్నారు. ఐడీ కార్డులు వేసే క్రమంలోనే ఆ 20 కుక్కలకు టీకాలు కూడా వేయించామని చెప్పారు. బాంద్రా వాసి సోనియా షెలార్‌ ముంబైలో దాదాపు 300 వీధి కుక్కలకు ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నారు. ఈక్రమంలో ఆమె ముంబై మున్సిపల్‌ కారొరేషన్‌కు చెందిన పశువైద్యుడు డా. కలీమ్‌ పఠాన్‌ pawfriend.in సభ్యులతో కలిసి పనిచేస్తున్నారు. ఆ డాగ్స్‌ కు టీకాలు వేయిస్తున్నారు. వాటికి ట్యాగింగ్‌ చేయిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper