PPF – SIP : ముఖ్యంగా కొత్తగా పెట్టుబడి పెట్టాలనీ భావించే వారికి ఇవి చాలా భయాన్ని కలిగిస్తున్నాయి. స్టాక్స్ అలాగే మ్యూచువల్ ఫండ్లు రెండు కూడా రిస్క్ తో కూడిన పెట్టుబడి ఎంపికలు. కాబట్టి మీరు రిస్క్ లేకుండా సురక్షితమైన పెట్టుబడి పథకం కోసం ఆలోచిస్తున్నట్లయితే మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పథకంలో మీరు బలమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉంది. దీనినీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మీ డబ్బుకు ఈ పథకం పూర్తి భద్రతను కల్పిస్తుంది. ప్రస్తుతం పిపీఎఫ్ మీద కేంద్ర ప్రభుత్వం 7.1% వడ్డీ రేటు అందిస్తుంది. వార్షిక కాంపౌండ్ వడ్డీ రేటు లభిస్తున్న ఈ పథకం మీరు ఏదైనా బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్ లో కూడా చేరవచ్చు. ఇందులో మీరు ఏడాదికి కనీసం గా రూ.500 రూపాయలు పెట్టుబడి పెట్టుకోవచ్చు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
అలాగే మీరు ఇందులో గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి చేసుకోవచ్చు. మీరు ఒకేసారి లేదా వాయిదాలలో కూడా పిపిఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు పిపీఎఫ్ పథకంలో ఏడాదికి ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా మీరు 15 ఏళ్ల తర్వాత ఇందులో రూ.27 లక్షల కంటే కూడా ఎక్కువ రాబడిని పొందవచ్చు. పిపీఎఫ్ పథకానికి 15 ఏళ్ళు మెచ్యూరిటీ సమయం. మీరు పిపీఎఫ్ లో ప్రతి ఏడాది ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీరు 15 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయానికి మొత్తంగా రూ.27,12,139 అందుకోవచ్చు.
Also Read : కుటుంబం కోసం నిధిని సెట్ చేయాల్సిందే.. దీని కోసం ఏం చేయాలంటే?
మీరు పెట్టిన పెట్టుబడి రూ.15 లక్షలతో పాటు మీరు రూ.12,12,139 వడ్డీ రూపంలో పొందవచ్చు. భారతదేశ పౌరులు ఈ పథకానికి అర్హులు. అలాగే ఒకవేళ మీ ఇంట్లో మైనర్ పిల్లలు ఉంటే వాళ్ల పేరు మీద కూడా మీరు పిపిఎఫ్ లో పొదుపు ప్రారంభించవచ్చు. కానీ ఒక వ్యక్తికి కేవలం ఒక పిపిఎఫ్ ఖాతా మాత్రమే తెరిచే అవకాశం ఉంటుంది. ఏడాదికి చిన్న చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి పొందాలని అనుకుంటున్నా వారికి బ్యాంకులలో లేదా పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పీపీఎఫ్ పథకం చాలా బెటర్.