Colour Photo: జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ కి జాతీయ అవార్డు వచ్చింది. ఒక చిన్న సినిమాకి జాతీయ అవార్డు ? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సినిమాకు అవార్డు వస్తుందని, ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఊహించలేదు. మరి అంత గొప్ప అవార్డు ఇంత చిన్న సినిమాకి ఎలా దక్కింది ?. రొటీన్ తెలుగు సినిమా ఫార్ములానే కదా, ఈ చిత్రంలోనూ ఉంది. కానీ.. విభిన్నంగా వర్ణ భేదాన్ని చూపించారు. పైగా మొదట్లో ఏ ప్రేమ కథ అయితే మనసుకు ఉల్లాసం కలిగించిందో, చివరకు అదే ప్రేమ కథ గుండెను పిండేస్తోంది.
ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడాలి. క్లైమాక్స్ లో సుహాస్ తన ప్రేమను వ్యక్త పరిచే సమయంలో చెప్పే మాటలు మనసుకు హత్తుకుని… ఈ కథలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తోంది. ముఖ్యంగా నల్లగా ఉన్న వాళ్ళు సంఘంలో ఎదుర్కునే కష్టాల కోణంలో నుంచి ఎమోషనల్ లవ్ స్టోరీగా కథ ఎండ్ అవ్వడం ఈ సినిమా ప్రత్యేకత.
Also Read: Thank You Movie Collections: ‘థాంక్యూ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఇవే
సినిమా మొదటి నుంచి మనం హీరో క్యారెక్టర్ భావాలతో పూర్తిగా ఏకీభవిస్తూ.. సినిమా మొత్తం అదే ఫీల్ తో చూస్తాము. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బాధాకరమైన ముగింపు కూడా, మనకు బాగానే ఉందేమోనన్న భ్రమను కలిగిస్తుంది. అంత గొప్పగా వచ్చింది ఈ చిత్రం ముగింపు. ప్రేక్షకులకు ఈ ఫీల్ రావడానికి హీరో పాత్రను పరిచయం చేసిన విధానమే.
హీరో మొదట్లో హీరోయిన్ తో ఒక మాట అంటాడు. “నాకు మీ నుండి సింపతీ వద్దండి. నన్ను నాలా ప్రేమించేవాళ్ళు కావాలి”, అని. ఇలాంటి మాటలతో ప్రేక్షకుడి మనసును ఈ సినిమా ముగింపుకు దర్శకుడు ముందు నుంచే సిద్ధం చేసి ఉంచాడు. పోరాడేవాడే మనిషి. ఓడిపోయి చేతులెత్తేసేవాడు కానే కాదు. ఓటమిలో పాఠం ఉంది. గెలుపులోనే జీవితం ఉంది అన్నారు అన్నట్టు ఈ కథ కూడా ఇదే ఆలోచనతో సాగింది.
పైగా ఈ చిత్రంలో అనేక సంఘర్షణలు ఉన్నాయి. వర్ణ వివక్షతో పాటు కుల వివక్ష కూడా సినిమా పై తీవ్రతను పెంచింది. అందరి కులల్లోనూ నల్లగా ఉన్నవారు, తెల్లగా ఉన్నవారు ఉన్నారు. వారు ఏదొక సమయంలో వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. అందుకే, అసలు ఈ వివక్షను మనం ఎందుకు చూపాలి ? అనే ఆలోచనను దర్శకుడు ప్రేక్షకులకు కలిగించాడు.
అలాగే ఈ సినిమా హీరోహీరోయిన్ల పాత్రలు కూడా బలంగా ఉన్నాయి. “లక్క బంగారంలా కలిసిపోయి.., చివరకు బంగారం హరించుకుపోయి, లక్క మాత్రమే మిగిలినట్టు.. ఈ కథలో హీరోయిన్ మాత్రమే మిగులుతుంది. ఆమె ప్రేమ కోసం హీరో కూడా హరించుకుపోతాడు. ఈ ఒక్క పాయింట్ చాలు ఈ కథ స్థాయి చెప్పడానికి. కొన్ని సినిమాలు అనేవి మన ఈలలు ,చప్పట్లు వరకే పరిమితం అవుతాయి. కానీ ‘కలర్ ఫోటో’ లాంటి సినిమా మన గుండెని తాకి మన కళ్ళను తడి చేస్తాయి. అందుకే.. ‘కలర్ ఫోటో’కి జాతీయ అవార్డు దక్కింది.
Also Read:Thaman: తమన్ సంగీతానికి దేశమే పులకరించింది.. అల వైకుంఠపురానికి జాతీయ పురస్కారం వరించింది..
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: These are the reasons for the national award for the movie color photo
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com