YS Jagan : చేసిన తప్పే తమది. కానీ ఆ తప్పును ఎత్తిచూపుతున్నారు వైసీపీ శ్రేణులు. గత ఐదు సంవత్సరాలుగా అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. తెరపైకి మూడు రాజధానులు తెచ్చారు. వాటిని సైతం ఏర్పాటు చేయలేకపోయారు. కనీసం ముందు సర్కార్ నిర్మించిన కట్టడాలను కూడా నిర్లక్ష్యంగా వదిలేశారు. కనీసం వాటిని పట్టించుకోలేదు. దీంతో అమరావతి ప్రాంతం ఒక చిట్టడవిలా మారిపోయింది.ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోజంగిల్ క్లియరెన్స్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దాదాపు 33 వేల ఎకరాల్లో పేరుకుపోయిన చెత్తను, ముళ్ళ పొదలను తొలగిస్తున్నారు. ఇందుకుగాను 33 కోట్ల రూపాయలు కేటాయించారు. దానినే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా హైలైట్ చేస్తోంది. జంగిల్ క్లియరెన్స్ పనులకు అంతనగదు అవసరమా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కానీ ఈ పరిస్థితికి వైసిపి సర్కార్ నిర్లక్ష్యమే కారణమన్న విషయాన్ని మరిచిపోతున్నారు.
2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. అందరి ఆమోదంతో అమరావతి రాజధానిని ప్రకటించారు. దాదాపు 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించారు. మరో 24 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకొని.. రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించారు. నవ నగరాలు నిర్మించి.. ప్రపంచానికి తలమానికంగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు భావించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి తగ్గట్టు నివాస గృహాల నిర్మాణాన్ని ప్రారంభించారు. తాత్కాలిక సచివాలయం, కోర్టు భవనాలు, అసెంబ్లీ.. ఇలా అన్నింటినీ పూర్తి చేశారు. ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను సైతం ప్రారంభించారు. వాటికి సంబంధించి బేస్మెంట్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
2019లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి అమరావతిపై నిర్లక్ష్యం ప్రారంభమైంది. నిర్మాణాలను యధాతధంగా విడిచిపెట్టారు. ఎక్కడ కనీసం జంగిల్ క్లియరెన్స్ కూడా చేయలేదు. ఈ ఐదు సంవత్సరాల పాటు ఆ 33 వేల ఎకరాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదు. దీంతో ఆ ప్రాంతం ఒక చిన్నపాటి అడవిలా మారిపోయింది. అప్పటికే రాజధాని కోసం సమీకరించిన భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన జగన్ సర్కార్.. అప్పటివరకు నిర్మించిన నిర్మాణాల స్థితిగతులు ఏమిటి? వాటిని ప్రత్యామ్నాయంగా ఎలా వాడుకోవాలి? ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఐకానిక్ భవనాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి? అనే అంశాలను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. కొందరు మంత్రులైతే అమరావతి రాజధానిని స్మశానంతో పోల్చారు. ఆ భావనతో కాబోలు నిర్లక్ష్యంగా విడిచిపెట్టారు.
సాధారణంగా పొలాలను నిర్లక్ష్యంగా విడిచి పెడితేనే స్వరూపం మారిపోతాయి. ఖాళీ ఇంటి స్థలాన్ని విడిచి పెడితే ఏ స్థాయిలోకి మారుతాయో తెలియంది కాదు. అటువంటిది 5 సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా అమరావతిని విడిచిపెట్టారు. దారుణంగా దెబ్బతీశారు.దీంతో ఆ ప్రాంతం ఒక అడవిలా మారిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతిని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. కనీసం ఆ నిర్మాణాలను చూడాలన్న వీలుకాని పరిస్థితి. ఎమ్మెల్యేలు, అధికారుల నివాస గృహాలకు వెళ్లాలంటే రోడ్డు మార్గం కనిపించని దయనీయ పరిస్థితిలో రాజధాని ఉంది. ఈ పరిస్థితుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడం అనివార్యం. అందుకే 33 కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. టెండర్లను కూడా పిలిచారు. ఈనెల 22న ఖరారు చేయనున్నారు. 45 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఊర్వస్థితికి తీసుకురానున్నారు. అయితే ఈ పరిస్థితికి జగన్ నిర్లక్ష్య వైఖరి ముమ్మాటికీ కారణం. ఇది తెలిసి కూడా వైసిపి శ్రేణులు ఇప్పుడు జంగి ల్ క్లియరెన్స్ పనులపై దుష్ప్రచారం చేస్తుండడం.. ఆ పార్టీకే మైనస్ కానుంది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వైసిపి ప్రచారం ఆపకుంటే.. మూల్యం చెల్లించుకోవడం ఖాయం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Ys jagans mistakes in ap politics have a heavy price