Parabhava Nama Samvatsaram: తెలుగువారి తొలి పండుగగా భావిస్తారు ఉగాదిని. ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఉన్న ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీ. రేపే కొత్త తెలుగు సంవత్సరం కూడా. అయితే ఈ కొత్త సంవత్సరం పేరు కాస్త వింతగా ఉంది. పరాభవ నామ సంవత్సరం గా పేరు ఉంది. దీంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరాభవ అంటే ఈ ఏడాది మొత్తం అపజయాలు, అవమానాలు ఎదురవుతాయన్నది ఒక భయం. సోషల్ మీడియాలో సైతం ఈ పరాభవ నామ సంవత్సరం పై లోతైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ పరాభవ నామ సంవత్సరం గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
పోస్ట్ సారాంశం ఇది..
ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ ఇలా ఉంది.’ పరాభవలో పరా అంటే పరా భట్టారిక ( లలితా దేవి ). భావ అంటే సాక్షాత్భవుడు, పరమశివుడు. అంటే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు అన్నమాట. సామరస్య స్వరూపంతో తమ బిడ్డలను రక్షిస్తారు అని దాని అర్థం’ అంటూ వివరించారు సదరు నెటిజన్. పరాభ పేరుతో ఈ సంవత్సరం పేరు విని చాలామంది భయపడుతున్నారని.. ఎలాంటి భయాందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పార్వతీ పరమేశ్వరుడిని భక్తితో కొలుద్దాం.. సత్య,ధర్మ, భక్తి మార్గంలో ఉందాం.. అంటూ పరాభవ నామ సంవత్సరం గురించి వివరించ సాగారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చాలా గొప్పదని..
మరోవైపు పరాభవ నామ సంవత్సరం గురించి మరోలా వ్యవహరిస్తున్నారు పురోహితులు, పండితులు. పరాభవ తెలుగు పంచాంగం ప్రకారం 60 ఏళ్ల చక్రంలో 40 సంవత్సరంగా వివరిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరాభవంలో పరా అంటే చాలా గొప్పది. అత్యున్నతమైనది. భవ అంటే పుట్టుక, స్థితి అని చెబుతున్నారు. ఈ రెండు కలిపితే గొప్ప స్థితిని పొందేది అని వివరిస్తున్నారు. అయితే సాధారణంగా పరాభవ అంటే ఓటమి గుర్తు వస్తుంది. కానీ ఈ కొత్త సంవత్సరం పేరు మాత్రం చాలా చర్చకు దారితీస్తోంది. పరాభవ అర్థం ఏంటంటే, పరా అంటే పరా భట్టారిక(లలిత దేవి) భవ అంటే సాక్షాత్తు భవుడు. పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు, సామరస్య స్వరూపముతో, తమ బిడ్డలు రక్షిస్తారని అర్థం. చాలామంది ఈ సంవత్సరం పేరు విని భయపడుతున్నారు. పండితులు ఏం చెప్తున్నారు అంటే..పరా అంటే పరా భట్టారిక(లలిత దేవి) భవ అంటే సాక్షాత్తు భవుడు. పరమశివుడు.అంటే ఈ సంవత్సరం ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు.
అంతర్యామికి ఒక చిన్న విషయంలో వివరణ: మార్చి 19వ తారీకు ఉగాది. పరాభవనామ సంవత్సరం పేరుతో మనకి పరిచయం కాబోతుంది. చాలామంది పరాభవ అంటే అవమానాలు ఎదురవుతాయి. పేరులోనే ఉన్నది పరాభవం అనుకుంటారు. నిజానికి పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవాలు అధికంగా ఉంటాయి అని కాదు.
— కన్నేపల్లి✨ సరస #sarc Textrovert. (@Ksravishankar2) March 18, 2026
