spot_img
HomeతెలంగాణTelangana Tiger Viral Video: వామ్మో.. పెద్దపులి.. చూస్తుండగానే ఏం చేసిందో తెలుసా.. వైరల్ వీడియో

Telangana Tiger Viral Video: వామ్మో.. పెద్దపులి.. చూస్తుండగానే ఏం చేసిందో తెలుసా.. వైరల్ వీడియో

Telangana Tiger Viral Video: దండకారణ్యాలలో పులులు సంచరిస్తుంటాయి. ఆకలి వేసినప్పుడు వేటాడుతుంటాయి. పులి వేటాడితే సాలిడ్ గా ఉంటుంది. ప్రత్యర్థి జంతువు ఎంత బలంగా ఉన్నప్పటికీ పులి పంజా దెబ్బకు అది తలవంచాల్సిందే. పులికి ఆహారం కావాల్సిందే.

మనదేశంలో పులికి ఆవాసంగా ఉన్న అడవులు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలానే అడవులు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్.. ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఈ అడవులలో పులులు నివసిస్తున్నాయి. గతంలో పులుల సంఖ్యను అటవీశాఖ అధికారులు ఉజ్జయింపుగా మాత్రమే చెప్పేవారు. అయితే కొంతకాలంగా అడవులలో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా అధికారులు పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఆ పులులకు పేర్లు కూడా పెట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ తర్వాత.. ఆ స్థాయిలో పులులు ఎక్కువగా సంచరించేది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అడవుల్లోనే. ముఖ్యంగా నాగర్ కర్నూల్ పరిధిలోని నల్లమల్ల అడవుల్లో పులులసంఖ్య అధికంగా ఉంటుంది. నల్లమల అడవుల్లోని ఫరహాబాద్ వ్యూ పాయింట్ సమీపంలో ఇటీవల ఎఫ్ 55 అనే ఆడ పులి అటవీ శాఖ అధికారులకు దర్శనమిచ్చింది. అటవీశాఖ అధికారులు మూడు రోజుల పర్యటనలో భాగంగా అడవిని సందర్శించారు. ఈ క్రమంలో అటవీశాఖాధికారి సువర్ణ నల్లమల అడవుల్లో పర్యటిస్తుండగా.. ఆడ పులి కనిపించింది.

అటవీ శాఖ అధికారులు ఆడ పులిని అత్యంత సమీపం నుంచి చూశారు. ఆడపులి వేటను ముగించుకుని.. కడుపునిండా మాంసాన్ని తిని..బ్రేవ్ మంటూ బయటికి వచ్చింది. వచ్చిన తర్వాత కాసేపు ఆటవిడుపు కోసం ఒక చెట్టును ఎక్కింది. వెంటనే దిగి మళ్లీ లోపలికి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాలను అటవీశాఖ అధికారులు వాహనాలలో ఉండి.. తమ ఫోన్లలో చిత్రీకరించారు.. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి..” పులి బయటకు వచ్చింది. వేట ను ముగించుకుని వస్తుండగా మేం చూశాం. పులి సరదాగా అటూ ఇటూ తిరిగిందని” అటవీ శాఖ అధికారులు చెప్పారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper