HomeతెలంగాణTelangana Municipal Elections Counting: మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ షురూ.. తొలి ఫలితం వచ్చేసింది

Telangana Municipal Elections Counting: మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ షురూ.. తొలి ఫలితం వచ్చేసింది

Telangana Municipal Elections Counting: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ శుక్రవారం(ఫిబ్రవరి 13న) ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ మొదలు పెట్టారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్‌ జరుగుతోంది.మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించిన అధికారులు తర్వాత బ్యాలెట్‌ బాక్సులు ఓపెన్‌ చేస్తున్నారు. తక్కువ పోలింగ్‌ నమోదైన మున్సిపల్‌ వార్డుల ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి.

బోణీ కొట్టిన బీఆర్‌ఎస్‌..
హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నం 11, 12వ వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 24 వార్డులు ఉండగా, మరో 10 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబరుస్తోంది. నర్సాపూర్‌లో 7, 10 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది. ఎల్లంపేట 10, 11 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది. దీంతో బీఆర్‌ఎస్‌ పట్టు నిలుపుకుదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ సాధించింది. తొలి మున్సిపాలిటీని గెలిచింది. 14 వార్డులో బీఆర్‌ఎస్‌ గెలిచింది. ఒక ఇండిపెండెంట్‌ గెలిచారు. కాంగ్రెస్‌ కేవలం మూడుచోట్ల గెలిచింది.

పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం..
ఇక రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ములుగులో కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. ఇక్కడ 8 వార్డుల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం కనబరుస్తోంది. 1,3, 4, 6వ వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మంత్రి సీతక్క నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఆధిక్యం కనిపిస్తోంది. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని మధిరలోనూ కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. ఇక్కడ కూడా స్పష్టమైన మెజారిటీ దిశగా కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. కొల్లాపూర్‌ 1, 14 వార్డుల్లో కాంగ్రెస్‌ గెలిచింది. ఆలియాబాద్‌ 10వ వార్డులో కాంగ్రెస్‌ గెలిచింది. ఇక్కడ 1, 13వ వార్డులో బీఆర్‌ఎస్‌ గెలిచింది. ఇక హుస్నాబాద్‌ మంత్రి పొన్నం ప్రాభాకర్‌ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్‌ విజయం సాధిస్తోంది. 1, 4, 5 వార్డుల్లో కాంగ్రెస్‌ గెలిచింది. మెజారిటీ వార్డుల్లో ఆధిక్యం కనబరుస్తోంది. హాలియాలో 5, 7వ వార్డుల్లో కాంగ్రెస్‌ గెలిచింది.

జగిత్యాలలో ఆసక్తికరం..
జగిత్యాల మున్సిపాలిటీల్లో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ మాజీ మంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి.జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌కుఆర్‌ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లో సంజయ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టగా, జీవన్‌రెడ్డి ఇండిపెండెంట్లను నిలిపారు. దీంతో ఎవరి ఆధిక్యం ఉంటుంది అనేఆది ఆఆసక్తిగా మారింది.

అక్కడక్కడ బీజేపీ లీడ్‌..
ఇక తెలంగాణలో అక్కడక్కడ బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. యాదగిరి గుట్ట, రాయికల్, నిజాబాబాద్‌కార్పొరేషన్, కరీనంగర్‌ కార్పొరేషన్‌లో కొన్ని వార్డుల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper