HomeతెలంగాణTelangana Inter Results 2025: ఒక్క మార్కు.. ఒకే ఒక్కమార్కు.. 1.85 లక్షల మందిని ఫెయిల్‌...

Telangana Inter Results 2025: ఒక్క మార్కు.. ఒకే ఒక్కమార్కు.. 1.85 లక్షల మందిని ఫెయిల్‌ చేసింది!

Telangana Inter Results 2025 తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు మంగళవారం(ఏప్రిల్‌ 22న) విడుదలయ్యాయి. గతేడాదికంటే ఈసారి మెరుగైన ఫలితాలే వచ్చాయి. ఇక ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. మొత్తం 9.97 లక్షల మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 83 శాతం, ఫస్టియర్‌లో 71 శాతానికిపైగా ఉత్తీర్ణ తసాధించారు. అయితే ఒక్క మార్కు తేడాతో 1.85 లక్షల మంది ఫెయిల్‌ అయ్యారు.

Telangana Inter Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఒక్క మార్కు తేడా అనేకమంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపింది. బోర్డు వర్గాల ప్రకారం, దాదాపు 1.85 లక్షల మంది విద్యార్థులు ఒక్క మార్కు తేడాతో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆవేదనను కలిగించింది. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 71.37గా నమోదైంది. ఇందులో బలమైన ప్రదర్శన కనబర్చిన గురుకుల విద్యా సంస్థలు 83.17 శాతం ఉత్తీర్ణతతో ముందున్నాయి. అంతేకాకుండా, కొన్ని కళాశాలల్లో టాప్‌ మార్కులు సాధించిన విద్యార్థులు మెరిశారు. బైపీసీ స్ట్రీమ్‌లో ఓ విద్యార్థిని 997 మార్కులతో టాప్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఎంపీసీలో నలుగురు విద్యార్థులు 996 మార్కులు సాధించారు. దేవరకొండ గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివిన విద్యార్థిని కూడా బైపీసీలో 996 మార్కులు సాధించడం విశేషం.

Also Read: సీఎం రావాలె.. పెండ్లి కావాలె.. ఓ యువకుడి వింత కోరిక!

ఒక్క మార్కుతో..
ఇదిలా ఉంటే..1.85 లక్షల మంది ఫెయిల్‌ కావడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పినట్లు, గ్రేస్‌ మార్కులు, రీ–వెల్యూయేషన్‌ విధానాలపై స్పష్టత అవసరం. అలాగే, విద్యార్థుల మెరుగైన మానసిక స్థితిని పరిగణలోకి తీసుకుని, మరింత హృదయపూర్వక పరీక్షా విధానం అవసరమని సూచిస్తున్నారు. రీవాల్యువేషన్, రీకౌంటింగ్‌లో ఇందులో చాలా మంది పాస్‌ అయ్యే అవకాశం ఉంది.

మే 22 నుంచి సప్లిమెంటరీ..
ఇక మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఫాస్‌ అయ్యే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper