తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఫలితాలు విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి వెబ్ సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చని సూచించారు. https://results.cgg.gov.in లో పలితాలు చూసుకోవచ్చని అదికారులు తెలిపారు.4,55,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగా ద్వితీయ సంవత్సరం మార్కులు కేటాయించారు. సెకండియర్ లో ప్రాక్టికల్స్ కు వంద శాతం మార్కులు కేటాయించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు 35 శాతం మార్కులు వేశారు. 1,76,719 మంది విద్యార్థులు ఏ గ్రేడ్,1,04,886 మంది విద్యార్థులు బి గ్రేడ్,61,887 మంది విద్యార్థులు సి గ్రేడ్1,08,099 మంది విద్యార్థులు డి గ్రేడ్ సాధించారు.
మొదటి సంవత్సరం సంబంధిత విషయాల్లో వచ్చిన మార్కులే ద్వితీయ సంవత్సరంలో ఇచ్చామని మంత్రి సబిత తెలిపారు. ప్రాక్టికల్స్ లో అందరికి గరిష్ట మార్కులు వేశామని వివరించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో మాత్రం పాస్ మార్కులు వేశామని, విద్యార్థులు అసంతృప్తి చెందకపోతే కరోనా వైరస్ తగ్గిన తర్వాత పరీక్షలు రాసుకోవచ్చని సూచించారు. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ తోనే విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా తప్పులు ఉంటే 040-24600110 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.