Homeటాప్ స్టోరీస్TGSRTC Strike Losses 17 Crore Daily: ఆర్టీసీకి రోజూ 17 కోట్ల లాస్.. పండగ...

TGSRTC Strike Losses 17 Crore Daily: ఆర్టీసీకి రోజూ 17 కోట్ల లాస్.. పండగ చేసుకుంటున్న ఆంధ్రా బస్సులు.. ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీలు

TGSRTC Strike Losses 17 Crore Daily: తమ సమస్యలు పరిష్కరించాలని.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే డిపోలలో నిలిచిపోగా.. ప్రవేట్ బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సంపేటలో ఓ ఆర్టిసి డ్రైవర్ శరీరం మీద పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. అతడి శరీరం కాలిపోయింది. ప్రస్తుతం అతడు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. […]

TGSRTC Strike Losses 17 Crore Daily: తమ సమస్యలు పరిష్కరించాలని.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే డిపోలలో నిలిచిపోగా.. ప్రవేట్ బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సంపేటలో ఓ ఆర్టిసి డ్రైవర్ శరీరం మీద పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. అతడి శరీరం కాలిపోయింది. ప్రస్తుతం అతడు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలను తీవ్రతరం చేశారు.

ఆర్టీసీ సమయం వల్ల నిన్న ఒక్కరోజే దాదాపు 17 కోట్లకు పైగా నష్టం వచ్చింది. టికెట్లు అమ్మకం ద్వారా కేవలం 3.22 కోట్లు మాత్రమే వచ్చాయి. వరంగల్ లాంటి అతిపెద్ద రీజియన్ లో రెండు కోట్లకు పైగా రావాల్సిన ఆదాయం.. కేవలం లక్షలకే పరిమితమైంది. ఆర్టీసీ సొంత బస్సుల్లో దాదాపు 6500 డిపోలకు మాత్రమే పరిమితమయ్యాయి. 11 అద్దె బస్సులను తిప్పినప్పటికీ ప్రయాణికులకు ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 ప్రమాదాలు జరిగాయి. ఇందులో చాలావరకు బస్సులు డ్యామేజ్ అయ్యాయి.

సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు చార్జీలను అమాంతం పెంచాయి. ప్రత్యేకంగా చార్జీల శాతం 50 కి పెరిగింది. అంత రాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల్లో చార్జీలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్ నగరం తో సహా తెలంగాణలోని ప్రధాన నల నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. వేసవి నేపథ్యంలో ఏసీ బస్సులకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులలో తెలంగాణ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ పండగ చేసుకుంటున్నది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు బస్సులను అధికంగా తిప్పుతున్నది. దీంతో ఏపీ ఆర్టీసీకి దండిగా ఆదాయం వస్తున్నది. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా తమ సర్వీసులను పెంచాయి. దీనికి తోడు చార్జీలను కూడా పెంచాయి. ఫలితంగా ట్రావెల్స్ సంస్థలు భారీగా ఆదాయాన్ని వెనకేసుకుంటున్నాయి.

ప్రభుత్వం అనేక దఫాలుగా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో సమ్మె అనివార్యంగా మారింది. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను, ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. దశలవారీగా బకాయిలు చెల్లిస్తామని.. ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పటికీ ఆర్టీసీ కార్మికులు వినిపించుకోవడం లేదు. జేఏసీ ఎన్నికలు కచ్చితంగా తాము చెప్పిన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చవలసిందేనని చెబుతుండడంతో.. సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ఉమ్మడి వరంగల్లో పరిస్థితి భయానకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper