Homeఎంటర్టైన్మెంట్Prabhas Darling re release controversy: 'డార్లింగ్' రీ రిలీజ్ థియేటర్ లో ప్రభాస్ ఫ్యాన్స్...

Prabhas Darling re release controversy: ‘డార్లింగ్’ రీ రిలీజ్ థియేటర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కి చేదు అనుభవం.. చితకబాదిన యాజమాన్యం..

Prabhas Darling re release controversy: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘డార్లింగ్'(Darling4K) చిత్రాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయగా దానికి అభిమానులు , ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య కాలం లో విడుదలైన రీ రిలీజ్ సినిమాల్లో ‘డార్లింగ్ కి వచ్చినంత రెస్పాన్స్ ఏ చిత్రానికి కూడా రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. […]

Prabhas Darling re release controversy: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘డార్లింగ్'(Darling4K) చిత్రాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయగా దానికి అభిమానులు , ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య కాలం లో విడుదలైన రీ రిలీజ్ సినిమాల్లో ‘డార్లింగ్ కి వచ్చినంత రెస్పాన్స్ ఏ చిత్రానికి కూడా రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజున 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘రేస్ గుర్రం’ రీ రిలీజ్ క్లోజింగ్ వసూళ్లకు రెండింతలు ఎక్కువగా మొదటి రోజే వచ్చిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని థియేటర్స్ లో అభిమానుల సంబరాలు అంబరాలను అంటాయి. ప్రభాస్ కొత్త సినిమా విడుదలైతే థియేటర్స్ వద్ద ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో , ఈ చిత్రానికి ఆ రేంజ్ వాతావరణం కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల గొడవలు కూడా భారీగా జరిగాయి. ఉదాహరణకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ లో ప్రభాస్ అభిమానులను థియేటర్ స్టాఫ్ చితకబాదిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది . సుదర్శన్ థియేటర్ యాజమాన్యం పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు గొడవ జరగడానికి కారణం ఏమిటంటే, డార్లింగ్ సినిమాతో పాటు , ప్రభాస్ చిత్రాల్లోని కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ , కొన్ని ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ ని ప్రింట్ కి జత చేసి విడుదల చేశారు.

ఒక షోలో పాటలు , ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ ని ప్రదర్శించారు కానీ , తదుపరి షోలో మాత్రం ప్రదర్శించలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రచ్చ చేయగా , తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో థియేటర్ లోపలకు ప్రవేశించిన సిబ్బంది , ప్రభాస్ అభిమానుల పై లాఠీ ఛార్జ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారాయి. మూవీ రన్ టైం దృష్ట్యా , షెడ్యూల్ చేసిన షోస్ సమయానికి పడాలి కాబట్టి , అప్పుడప్పుడు థియేటర్స్ యాజమాన్యాలు ఇలాంటి స్పెషల్ ఎడిషన్స్ ని తొలగిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇలా చేసి ఉండొచ్చు. కానీ అభిమానులకు వీటితో సంబంధం లేదు కదా, కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి అంటూ సోషల్ మీడియా విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper