Political Journey of New Ministers : కొంతకాలంగా తెలంగాణ మీద అధిష్టానం ఎక్కువగా ఫోకస్ పెట్టింది.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ చేజారి పోకుండా ఉండడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు మొదలుపెట్టింది. రాష్ట్ర నాయకత్వాన్ని దూరం పెట్టకుండానే.. తన మార్క్ ను ప్రదర్శిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సామాజిక సమీకరణాలను ఏమాత్రం దూరం చేయకుండా.. ఒకే సామాజిక వర్గానికి అందలం ఎక్కించకుండా.. వెనుకబడిన కులాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తంగా తను అనుకున్న వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి అధిష్టానం స్థానిక నాయకత్వానికి ఒక రకంగా ఝలక్ ఇచ్చింది. ఇక నూతనంగా మంత్రి పదవులు సాధించిన శ్రీహరి, లక్ష్మణ్, వివేక్ రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే..
Also Read : రాములమ్మను పక్కనపడేశారే.. కోమటిరెడ్డిని పట్టించుకోలే.. లొల్లి మొదలైతదా?
వాకిటి శ్రీహరి
వాకిటి శ్రీహరి భక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన 1990లో ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 1993 వరకు ఆయన ఎన్ఎయూఐ అధ్యక్షుడిగా కొనసాగారు. 1993 నుంచి 1996 వరకు మక్తల్ మండలంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1996 నుంచి 2001 వరకు మక్తల్ హస్తం పార్టీ సెక్రటరీగా పనిచేశారు. 2001 నుంచి 2006 ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 2001లో మక్తల్ ప్రెసిడెంట్ గా గెలిచారు. ఆ తర్వాత నారాయణపేట జెడ్పిటిసిగా పనిచేశారు. డిసిసి ప్రెసిడెంట్ గా పని చేశారు. 2023లో శాసనసభకు ఎంపికయ్యారు.. ఇప్పుడు మంత్రి అయిపోయారు.
గడ్డం వివేక్
చనురు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గడ్డం వివేక్ కు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి వెంకటస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తండ్రి స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చారు. 2009లో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2016లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2017లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019 లో కమలం పార్టీలో చేరారు.. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పనిచేశారు పని చేశారు. 2023 నవంబర్లో మళ్ళీ చెయ్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గం లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మంత్రిగా ప్రమోషన్ సాధించారు.
అడ్లూరి లక్ష్మణ్
ధర్మపురి ఎమ్మెల్యేగా లక్ష్మణ్ ఇటీవల ఎన్నికల్లో గెలిచారు. 1982లో గోదావరిఖని జూనియర్ కాలేజీ ఎన్ ఎస్ యూ ప్రెసిడెంట్గా తన కెరియర్ ను లక్ష్మణ్ ప్రారంభించారు. ఆ తర్వాత కరీంనగర్ ఎన్ఎయూఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 1999లో మేడారం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నిర్మాణం జెడ్పిటిసిగా ఎన్నికయ్యారు. 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జడ్పీ చైర్మన్ గా పని చేశారు. 2009, 2010, 2014, 2018 లో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి ధర్మపురి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. దాదాపు నాలుగు సందర్భాల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. చివరికి 2023లో విజయం సాధించి ఇప్పుడు మంత్రి అయ్యారు. ఈ ముగ్గురికి ఎటువంటి శాఖలు కేటాయిస్తారనేది చూడాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం వరకు వీరికి కేటాయించే శాఖలకు పై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది.