Samantha Dubai Viral Photos : కొంతమంది సెలబ్రిటీలు రిలేషన్ లో ఉన్నప్పటికీ కూడా లేనట్టు బయటకు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు వాళ్ళు నిశ్చితార్థం చేసుకొని మన ముందుకొస్తుంటారు. ఈమధ్య కాలం లో ఈ ట్రెండ్ సర్వసాధారణం అయిపోయింది. సోషల్ మీడియా లో గాసిప్స్ గా అనిపించే అనేక సంఘటనలు నిజం అవుతున్నాయి. సమంత(Samantha Ruth Prabhu) చాలా కాలం నుండి ప్రముఖ బాలీవూడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో ప్రేమాయణం నడుపుతుందని, వీళ్లిద్దరు కొంతకాలం నుండి డేటింగ్ లో ఉంటున్నారని. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. రాజ్ నిడిమోరు గతంలో సమంత తో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ తీసాడు. ఇందులో సమంత ని విలన్ గా చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం మొదలైంది.
Also Read : బాలయ్యకు ఉన్న డిమాండ్ నాగార్జున కు ఎందుకు లేదు…
ఆ సాన్నిహిత్యం కాస్త సమంత కష్టకాలం లో ఉన్నప్పుడు ప్రేమగా మారిందని సమాచారం. రీసెంట్ గా సమంత, రాజ్ నిడిమోరు కలిసి ఎన్నో ప్రదేశాల్లో కనిపించారు. ముఖ్యంగా తిరుమలలో వీళ్లిద్దరు కలిసి జంటగా శ్రీవారి దర్శనం చేసుకోవడం వీళ్ళు కలిసి ఉంటున్నారు అనే వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే రాజ్ ‘శుభమ్’ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడని, అందుకే సమంత తో కలిసి కనిపించాడని, వాళ్ళ మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే ఉందని, మీరు ఊహించుకునే రిలేషన్ లేదని సమంత వ్యక్తిగా మ్యానేజర్ సోషల్ మీడియా రూమర్స్ పై స్పందించాడు. కానీ ఎంత దాచాలని అనుకున్నా నిజం దాగదు. కచ్చితంగా ఎదో ఒక రూపం లో బయట పడుతుంది. అలా సమంత విషయం లో కూడా నిజం బయటపడింది. రీసెంట్ గానే ఆమె దుబాయ్ టూర్ కి వెళ్ళింది. అక్కడ ఆమె దిగే ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
అలా రీసెంట్ గా ఆమె కూలింగ్ గ్లాస్ పెట్టుకొని దిగిన ఒక ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ కూలింగ్ గ్లాస్ రిఫ్లెక్షన్ లో రాజ్ నిడిమోరు ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ గమనించారు. అంటే రాజ్ తో కలిసి సమంత దుబాయ్ కి వెళ్ళింది అన్నమాట. రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫొటోలన్నీ రాజ్ నే తీసాడని అంటున్నారు. రిలేషన్ ఉండడం మంచిదే, కానీ ఆ రిలేషన్ గురించి అధికారికంగా అభిమానులకు కూడా చెప్తే సంతోషిస్తారు కదా. సమంత మాజీ భర్త నాగ చైతన్య గత ఏడాది యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ని వివాహం చేసుకున్నాడు. అందుకు అక్కినేని అభిమానులు ఎంతో సంతోషించారు. అదే విధంగా సమంత కూడా ఈ రిలేషన్ గురించి అధికారిక ప్రకటన చేస్తే అక్కినేని ఫ్యాన్స్ కంటే ఎక్కువ సంతోషిస్తాం అంటూ సమంత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.