Rinku Singh Engaged to MP Priya Saroj : రింకూ సింగ్ కొంతకాలంగా ప్రియా సరోజ్ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఆమె కూడా ఉన్నతమైన నేపథ్యానికి చెందిన యువతి. ఆమె ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాది పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచింది. ఆమె మచ్లీ షహర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సౌమ్యురాలిగా, ఉన్నత విద్యావంతురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఒక పార్టీలో రింకూ సింగ్ తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.. అది కాస్త ప్రణయం దాకా వెళ్ళిపోయింది.. వీరిద్దరి వ్యవహారం ఇరు కుటుంబాల సభ్యులకు తెలియడం, దానికి వారు సమ్మతం తెలియజేయడంతో.. అది ప్రణయం దాకా వెళ్ళింది..
రింకూ సింగ్ టీమిండియాలో వర్ధమాన ఆటగాడిగా కొనసాగుతున్నాడు..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు లో కీలక ఆటగాడుగా ఉన్నాడు. ఈ సీజన్లో అతడు విఫలమైనప్పటికీ.. 2023లో అతడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. నాడు గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో యష్ డయాల్ బౌలింగ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. తద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.. ఇక ఓడే మ్యాచ్ లో జట్టును గెలిపించి సరికొత్త రికార్డు సృష్టించాడు. అప్పటినుంచి అతడు ఆ జట్టులో తన స్థానాన్ని మారింత స్థిరం చేసుకున్నాడు. ఇక ఇటీవల ఐపీఎల్ వేలంలో కోల్ కతా జట్టు రింకూ సింగ్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అలా వచ్చిన డబ్బు ద్వారా రింకూ సింగ్ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు.. వాస్తవానికి రింకూ సింగ్ ది పేద కుటుంబం. ఆయన తండ్రి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవాడు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన రింకూ సింగ్ విపరీతంగా కష్టపడ్డాడు. మైదానంలో తీవ్రంగా శ్రమించాడు. చివరికి ఈ స్థాయిలో క్రికెటర్ గా స్థిరపడ్డాడు.
Also Read : విరాట్ కోహ్లీని అరెస్టు చేస్తారా? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
ఇక ప్రియతో ఎంగేజ్మెంట్ ను రింకూ సింగ్ లక్నోలోని ఓ ఖరీదైన హోటల్లో అత్యంత ఘనంగా జరుపుకున్నాడు. ఈ వేడుకకు 300 మంది దాకా అతిథులు హాజరయ్యారు.. ఇద్దరు సాంప్రదాయ బద్ధమైన డ్రెస్ లో కనిపించారు. ప్రియ – రింకూ సింగ్ వివాహం నవంబర్ 18న వారణాసిలో జరుగుతుంది. ప్రియ పార్లమెంట్ సభ్యురాలుగా మాత్రమే కాకుండా.. న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ కు ఆమె అత్యంత సన్నిహితురాలు. అంతేకాదు పార్టీలో కీలక సభ్యురాలు. ఉపన్యాసాలు ఇవ్వడంలో.. ఉత్తర ప్రదేశ్ లోని అధికార బిజెపిని ఇరుకున పెట్టడంలో ప్రియ మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రియకు బలమైన ఆర్థిక నేపథ్యం ఉన్నప్పటికీ.. ఆమెకు రాజకీయంగా పలుకుబడి ఉన్నప్పటికీ రింకూ సింగ్ ఎన్నడు దానిని వాడుకోలేదు. పైగా తన కష్టార్జితాన్ని మాత్రమే అతడు నమ్ముకున్నాడు. అతనిలో ఆ సింప్లిసిటీ బాగా నచ్చడంతో ప్రియ మరింత దగ్గరయింది.