HomeతెలంగాణACB raids on government officerఅవినీతిలో ఈ ఆఫీసర్ కొత్త బెంచ్ మార్క్.. ఏకంగా 100...

ACB raids on government officerఅవినీతిలో ఈ ఆఫీసర్ కొత్త బెంచ్ మార్క్.. ఏకంగా 100 కోట్ల ఆస్తులు.. ఏసీబీ అధికారులకే మైండ్ బ్లాంక్ అయ్యింది

ACB raids on government officer: ఆ నోట్ల కట్టలు బ్యాంకును తలపించాయి. బంగారు ఆభరణాలు జువెలరీ షాపును గుర్తుకు తీసుకొచ్చాయి. ఆస్తి పత్రాలు రియల్ ఎస్టేట్ కంపెనీని కళ్ళ ముందు నిలిపాయి. అతడి కార్లు.. ద్విచక్ర వాహనాలు.. బ్యాంకు లాకర్లు.. ఇలా ఒక్కటేమిటి.. అంబానీ కూడా ఈర్ష పడేలాగా ఉంది అతడి సంపాదన. అలాగని అతడేమి ఆగర్భ శ్రీమంతుడు కాదు.. ఎలాన్ మస్క్ కు తోబుట్టువు కాదు. కానీ ఇంత సంపాదన ఎలా సాధ్యమైంది అంటే.. తెలంగాణ […]

ACB raids on government officer: ఆ నోట్ల కట్టలు బ్యాంకును తలపించాయి. బంగారు ఆభరణాలు జువెలరీ షాపును గుర్తుకు తీసుకొచ్చాయి. ఆస్తి పత్రాలు రియల్ ఎస్టేట్ కంపెనీని కళ్ళ ముందు నిలిపాయి. అతడి కార్లు.. ద్విచక్ర వాహనాలు.. బ్యాంకు లాకర్లు.. ఇలా ఒక్కటేమిటి.. అంబానీ కూడా ఈర్ష పడేలాగా ఉంది అతడి సంపాదన. అలాగని అతడేమి ఆగర్భ శ్రీమంతుడు కాదు.. ఎలాన్ మస్క్ కు తోబుట్టువు కాదు. కానీ ఇంత సంపాదన ఎలా సాధ్యమైంది అంటే..

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏసీబీ డిపార్ట్మెంట్ కు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అవినీతి తిమింగలాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. వారి వద్ద నుంచి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. కొంతకాలంగా తెలంగాణలో ఈ ప్రక్రియ నిరాటంకంగా సాగిపోతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ అవినీతి అధికారులు తమ ధోరణి మార్చుకోవడం లేదు. పైగా వసూల విషయంలో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తున్నారు. బినామీ పేర్లతో భారీగా ఆస్తులను సంపాదించుకుంటున్నారు. ఒకటి, రెండు కాకుండా ఏకంగా వందల కోట్ల ఆస్తులను కూడబెడుతున్నారు.

హైదరాబాదులో ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్.. ఆయన బంధువుల ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భారీగా బంగారం బిస్కెట్లు.. ఆభరణాలు.. వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నగదు కూడా భారీగా ఉండడంతో ఏకంగా లెక్కింపు యంత్రాలను తీసుకొచ్చారు. నచ్చిన వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వడం.. కాంట్రాక్టులు ఇచ్చినందుకు లంచాలు తీసుకోవడం మోహన్ నాయక్ అలవాటుగా మార్చుకున్నాడు.

ఇలా అడ్డగోలుగా కాంట్రాక్టులు ఇచ్చి భారీగా దండుకోడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ఖరీదైన నివాసాలు.. ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. బంగారం.. ఇతర వ్యవసాయ భూములు కొన్నాడు. కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఆస్తులను కొనుగోలు చేశాడు. ఇతడి వద్ద ఉన్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా వంద కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇంకా కొన్ని భూమి పత్రాలను.. స్థిరాస్తులను లెక్కించాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు చేసినప్పటికీ.. అవినీతి అధికారులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. అందువల్లే ఎవరిని వదిలిపెట్టకుండా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అవినీతి తేలితే కటకటాల వెనక్కి పంపిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper