Mother Abandons Son: పాము పిల్లలకు జన్మనిచ్చినప్పుడు.. తను కన్న పిల్లల్ని తనే తింటుంది. అది సృష్టి ధర్మం. పాముకు ఉన్న శాపం వల్ల అలా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కానీ మనుషులకు అలాంటి శాపం లేదు. అలా వ్యవహరించాల్సిన అవసరం కూడా లేదు. స్వార్థం, కపటం, మోసం, వివాహేతర బంధాలు వంటి వాటిపై మోజు పెంచుకున్న మనుషులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఉచ్చ నీచాలు మర్చిపోయి అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు.
Also Read: వీడి తెలివి మామూలుది కాదు.. ఆటోలో ఏం తీసుకొచ్చాడో తెలుసా?
నల్లగొండ జిల్లాలో తన 15 నెలల వయసు ఉన్న కుమారుడిని వదిలి..ఇన్ స్టా లో పరిచయమైన ప్రేమికులతో కన్నతల్లి వెళ్లిపోయిన ఘటన నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది. బస్టాండ్ లో తన కుమారుడిని అనాధగా వదిలిపెట్టి ఆ తల్లి వెళ్ళిపోయింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ చిన్నారి తండ్రి చెంతకు వెళ్లిపోయాడు.. కుమారుడిని వదిలి వెళ్ళిపోయిన ఆ మహిళది హైదరాబాదులోని బోడుప్పల్ ప్రాంతం.. ఆమెకు నల్గొండ నగరంలో ఓ సెల్ ఫోన్ దుకాణంలో పనిచేసే యువకుడితో పరిచయం ఏర్పడింది..ఇన్ స్టా గ్రామ్ లో ఏర్పడిన ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో అ మహిళ తన 15 నెలల కుమారుడితో హైదరాబాదు నుంచి నల్గొండ వెళ్ళింది. నల్గొండ బస్టాండ్ కి వెళ్లిన తర్వాత తన ప్రియుడికి ఫోన్ చేసింది. అతడు ద్విచక్ర వాహనం పై వచ్చాడు. వచ్చి ఆమెను తీసుకెళ్లాడు..
బస్టాండ్ లో వదిలి వెళ్లిపోవడంతో ఆ కుమారుడు విపరీతంగా రోదిం చడం మొదలుపెట్టాడు. అమ్మా అమ్మా అంటూ దీనంగా ఏడ్చాడు. పోలీసులకు అక్కడ ఉన్న ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో.. వారు బస్టాండ్ కి వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ కుమారుడిని తల్లి వదిలి వెళ్లిపోయిన దృశ్యాలను సీసీ కెమెరాలలో చూశారు. ఆమె తన ప్రియుడితో వెళ్లిపోయిన తీరు పోలీసులకు కనిపించింది. ద్విచక్ర వాహనంపై ఉన్న నెంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. ఆ ద్విచక్ర వాహన యజమానికి ఫోన్ చేయగా.. తన వాహనాన్ని స్నేహితుడు తీసుకెళ్లాడని అతడు చెప్పాడు. ఆ స్నేహితుడి వివరాలను ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో పోలీసులు అతను చెప్పిన వివరాల ఆధారంగా ఆ వ్యక్తిని, ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారాన్ని ఆ మహిళ భర్తకు అందించారు. అనంతరం పోలీసులు బాలుడిని అతడి తండ్రికి అప్పగించారు. ఈ వ్యవహారంపై పెద్దమనుషుల సమక్షంలోనే మాట్లాడుకుంటామని చెప్పారు.
Also Read: అడవిలోకి వెళ్లి దారి తప్పిన ముగ్గురు అమ్మాయిలు.. నలుగురు అబ్బాయిలు.. ఆ తరువాత..
ఆ మహిళ తన ఇన్ స్టా ప్రేమికుడి అండ చూసుకొని భర్తతో ఇటీవల కాలంలో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. అతనిపై చీటికిమాటికి అరవడం ప్రారంభించింది. కొన్ని సందర్భాలలో విడాకులు ఇస్తానని బెదిరించింది. శనివారం నల్గొండ వెళ్లే ముందు కూడా అతనితో గొడవ పడ్డట్టు తెలుస్తోంది. పుట్టింటికి వెళ్తానని భర్తతో చెప్పిన ఆమె నల్గొండ వచ్చింది. ఇక్కడ ప్రియుడి తో కలిసి వెళ్లిపోయింది. కనీసం 15 నెలల కుమారుడు ఎలా ఉంటాడో.. అమ్మా అమ్మా అని ఏడుస్తాడనే సో ఇక్కడ లేకుండా ఆమె వెళ్లిపోవడం సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పోలీసుల సమక్షంలో ఆమె తన కొడుకు కోసం ఏమాత్రం తాపత్రయపడకపోవడం నివ్వెర పరుస్తోంది.
View this post on Instagram