Ganja smuggling in Hyderabad: కాలం మారుతోంది.. కొత్త టెక్నాలజీ వస్తోంది.. మానవ మేధస్సు సైతం కొత్త పుంతలు తొక్కుతోంది.. అయితే ఇలాంటి సమయంలో కొందరు తమ తెలివిని మంచి పనులకు కాకుండా చెడ్డ పనులకు వాడుతున్నారు. ఇదే తెలివిని కొన్ని మంచి పనులకు వాడడం వల్ల ఎన్నో రకాల అభివృద్ధి చెందవచ్చు అని కొందరు మేధావులు అంటున్నారు. కానీ సమాజానికి కీడు చేసే పనులకు వాడడం వల్ల చాలామంది పక్కదారి పడుతున్నారు. అంతేకాకుండా కొందరు తమ ప్రతిభను ఇలాంటి పనులకు వాడడం వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గంజాయి సరఫరా లో కొందరు చూపించే తెలివిని.. మంచి పనులకు వాడితే ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటుందని అంటున్నారు. ఇంతకీ వారు ఏం చేశారంటే?
Also Read: రాజకీయాలకు మాజీ సీఎం గుడ్ బై!
గంజాయి పై ప్రభుత్వం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటుంది. విస్తృతంగా తనిఖీలు చేపడుతూ గంజాయిని పట్టుకుంటుంది. ఇదే సమయంలో దీనిని సరఫరా చేసే వారిని కటకటాల్లోకి నెట్టేస్తుంది. అయినా కూడా కొందరు తమ తెలివితో గంజాయిని వివిధ మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా.. ఎవరికి అనుమానం రాకుండా కొన్ని వస్తువుల్లో దీన్ని తీసుకురావడం విశేషం.
తాజాగా హైదరాబాదులోని మొయినాబాద్ లో పోలీసులు చేసిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. అయితే ఈ గంజాయిని ఆటో నడిపే వ్యక్తి తన ఆటోలో ఉన్న స్పీకర్లలో దాచి ఉంచాడు. ఎవరికి అనుమానం రాకుండా స్పీకర్లలో అరకిలో వరకు దీన్ని ఒక కవర్లో పెట్టి దాచాడు. పోలీసులు ఈ గంజాయిని స్వాధీనం చేసుకొని మొయినాబాద్ కు చెందిన కంచ రాకేష్, నాంపల్లి కి చెందిన శుభం, ధర్మరాజు, సాయికుమార్, శ్రీకాంత్ అనే వ్యక్తుల నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆటోలు సీజ్ చేశారు.
ప్రతిరోజు పోలీసులు సాధారణంగానే వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కానీ గంజాయి విషయంలో పకడ్బందీగా ఉండడంతో.. వాహనాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే పోలీసులకు అనుమానాలు రాకుండా గంజాయి సరఫరా చేసే వ్యక్తులు ఒక్కోసారి వాహనాల్లోని అనుమానం రాణి ప్రదేశాల్లో కూడా తీసుకొస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గంజాయి వల్ల యువత ఎంతో చెడిపోతుందని.. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదని ప్రభుత్వం అంటుంది. ఇందులో భాగంగా ఏ చిన్న అనుమానం వచ్చిన తనిఖీలు చేస్తున్నారు.
Also Read: బీజేపీ వ్యవహారాలు నీకెందయ్యా రేవంతూ!
అయితే గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. ఎక్కువగా రాష్ట్రం బార్డర్లలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ గంజాయి పట్టుబడుతుంది. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గంజాయి విషయంలో చాలా సీరియస్ గా ఉంది. పట్టుబడిన గంజాయిని వెంటనే ధ్వంసం చేస్తున్నారు. అలాగే ఈ కేసులో దొరికిన వారికి జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా వేస్తున్నారు.