Raja Singh Gives Clarity: రాజాసింగ్.. తెలంగాణలో ప్రతీ హిందువుకు.. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రతీ హిందువుకు పరిచయం ఉన్నపేరు. ముస్లిం వ్యతిరేకిగా.. హిందూ టైగర్‌గా గుర్తింపు పొందారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో అసదుద్దీన్, అక్బరుద్దీన్‌ను తీవ్రంగా, డైరెక్ట్‌గా వ్యతిరేకించే నేత. మూడుసార్లు గోషామహల్ ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలవడంలో ఆయన ఈ వైఖరే కారణం. అయితే ఆయన హిందుత్వం ఇప్పుడు పీక్స్‌కు చేరింది. మతం పేరుతో ఏది మాట్లాడినా చెల్లుతుందన్నట్లుగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. 2023 ఎన్నికల సమయంలో బీజేపీ మళ్లీ సస్పెన్షన్ ఎత్తేసింది. ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. అయితే..రాజాసింగ్ ఏడాదికాలంగా సొంత పార్టీ నేతలపై, పార్టీపై విమర్శలు చేయడం ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల సమయం నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. అంతర్గత సమస్యగా భావిస్తూ పార్టీ నాయకత్వం చూసీ చూడనట్లు వదిలేసింది. కానీ, ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల సమయంలో పోటీకి వచ్చారు. కానీ అధిష్టానం అతడిని పోటీ చేయనివ్వలేదు. దీంతో అలిగిన రాజాసింగ్.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా ఆయన మళ్లీ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అధిష్టానంపై అసంతృప్తి..
రాజాసింగ్ రాజీనామా నిర్ణయం ఆకస్మికం కాదు. రాష్ట్ర నాయకత్వం కార్యకర్తల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులకు అన్యాయం జరగడం వంటి కారణాలు ఈ నిర్ణయానికి దారితీశాయి. ‘లక్షల మంది కార్యకర్తల అభిప్రాయాలను‘ పక్కనపెట్టిన రాష్ట్ర నాయకత్వంపై నేరుగా ఆరోపణలు చేశారు. జాతీయ నాయకత్వానికి రాష్ట్రంలోని కొందరు నాయకుల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని తెలియజేయాలనుకున్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ నాయకత్వంలోని అంతర్గత విభేదాలను బయటపెట్టాయి. ఆయన ప్రధాన డిమాండ్ కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలి అనే.
Also Read: అక్కడే ఎందుకు… హైదరాబాద్ లో మరో కేబుల్ బ్రిడ్జి.. విశేషాలివీ..
తిరిగి చేరనని క్లారిటీ..
ఇదిలా ఉంటే.. రాజాసింగ్ హిందుత్వ వాదానికి మద్దతు ఇచ్చే పార్టీ బీజేపీ మాత్రమే. రాష్ట్రంలో ఏ ఇతర పార్టీ ఆయనకు మద్దతు ఇవ్వవు. ఎందుకంటే ఆయన హిందుత్వంపైనే రాజకీయాలు చేస్తారు. శివసేన మద్దతు ఇచ్చినా.. అవి ఓట్లుగా మారవు. ఎందుకంటే తెలంగాణలో ఆ పార్టీకి లీడర్, క్యాడర్ లేదు. దీంతో రాజాసింగ్ మళ్లీ బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. కానీ, దీనిపై రాజాసింగ్ స్పందించారు. తాను బీజేపీలోకి తిరిగి వెళ్లనని స్పష్టం చేశారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచందర్‌రావు గురించి మాట్లాడారు. రామచందర్‌రావు మంచి రచయిత అని, అయితే ఆయన ఇక పోరాటం మొదలు పెట్టాలని సూచించారు.