HomeతెలంగాణHyderabad Traffic: నాకు ఇప్పుడే మూడ్ వచ్చింది.. ఇప్పుడే డైవర్షన్ పెట్టుకుంటా అంటే కుదురుతుందా..

Hyderabad Traffic: నాకు ఇప్పుడే మూడ్ వచ్చింది.. ఇప్పుడే డైవర్షన్ పెట్టుకుంటా అంటే కుదురుతుందా..

Hyderabad Traffic: హైదరాబాద్ నగరంలో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ తెలంగాణ ప్రభుత్వం వన్ బై ట్రాఫిక్ విధానాన్ని అమలుకు తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిచోత్మకంగా చేపడుతున్న హై సిటి ప్రాజెక్టులో భాగంగా కెవిఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ లేని కారిడార్ లను నిర్మించబోతోంది. దీనికోసం ఏడు మల్టీ లెవెల్ స్టీల్ ఫ్లై ఓవర్లు.. 7 అండర్ పాస్ లు నిర్మించబోతోంది. ఈ బృహత్తర నిర్మాణాల కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు అందుబాటులోకి తీసుకొచ్చారు. […]

Hyderabad Traffic: హైదరాబాద్ నగరంలో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ తెలంగాణ ప్రభుత్వం వన్ బై ట్రాఫిక్ విధానాన్ని అమలుకు తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిచోత్మకంగా చేపడుతున్న హై సిటి ప్రాజెక్టులో భాగంగా కెవిఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ లేని కారిడార్ లను నిర్మించబోతోంది. దీనికోసం ఏడు మల్టీ లెవెల్ స్టీల్ ఫ్లై ఓవర్లు.. 7 అండర్ పాస్ లు నిర్మించబోతోంది.

ఈ బృహత్తర నిర్మాణాల కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రకారం కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీని ప్రకారం కేబీఆర్ పార్కు చుట్టూ వాహనాలు ఒకే దిశలో పర్యాయనం సాగించాల్సి ఉంటుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వాహనదారుడు పోలీసులు సూచించిన కొత్త వన్ వే మార్గాల ద్వారా ప్రయాణం సాగించాల్సి ఉంటుంది.

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 నుంచి వచ్చే ప్రయాణికులు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నేరుగా వెళ్ళకూడదు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తప్పనిసరిగా ఎడమవైపు తిరగాల్సి ఉంటుంది. ఇక కొత్త రూట్ మ్యాప్ లను ఇప్పటికే గూగుల్ మ్యాప్స్ అప్డేట్ కూడా చేసింది. ప్రస్తుత పనులు జర్నలిస్టు కాలనీ.. రోడ్ నెంబర్ 45.. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ప్రాంతంలో జరుగుతున్నాయి. అందువల్ల ఇక్కడ ట్రాఫిక్ విపరీతంగా ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏర్పాటుచేసిన సైనేజ్ బోర్డులు లేదా చేంజింగ్ సూచనలు గమనిస్తూ వాహనదారులు ప్రయాణం సాగించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

వన్ వే ట్రాఫిక్ విధానం ద్వారా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రయాణికురాలు తన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఆకస్మాత్తుగా నిర్ణయం వస్తుంది. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ మా కష్టాలు ఎవరు పట్టించుకుంటారు. నాకు ఇప్పుడే మూడు వచ్చింది.. ఇప్పుడే డైవర్షన్ పెట్టుకుంటా అంటే ఎట్లా.. ప్రజల బాధలు కూడా అర్థం చేసుకోవాలి కదా.. ఈ ప్రాంతంలో వన్వే ట్రాఫిక్ విధానం కొద్ది రోజులపాటు కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇలా అయితే మా ఇబ్బందులు ఎవరు పట్టించుకుంటారు.. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రయాణం సాగించాలంటేనే ఇబ్బందిగా ఉంది. ఈ ప్రాంతంలో మేం పని చేసే కార్యాలయం ఉంది. ఇలాంటప్పుడు ఎలా ప్రయాణం సాగించాలని ఆ మహిళ ప్రశ్నించింది. ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper