Telangana YSR Congress Re-entry: తెలంగాణలో( Telangana) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విస్తరిస్తారా? జగన్మోహన్ రెడ్డి అదే ప్రయత్నంలో ఉన్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం లోటస్ ఫండ్ నివాసానికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు భారీగా జనాలు తరలివచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ లో దిగగానే స్వాగతం పలికేందుకు సైతం భారీగానే వచ్చారు. ఒక విధంగా ఇది బలప్రదర్శన గానే ఉంది. మరోవైపు లోటస్ ఫండ్ లో జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు నాయకులు భారీగా బారులు తీరారు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి సైతం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డిని స్వాగతించేందుకు భారీగా జన సమీకరణ చేయడం.. లోటస్ ఫండ్ కు భారీగా జనాలు తరలి రావడంతో తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విస్తరిస్తారా అన్న చర్చ అయితే ప్రారంభం అయింది.
Also Read: సోదరి ఎదురుపడితే పలకరించని జగన్!
పరస్పర ప్రయోజనాలు..
2012లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భవించింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. తొలి ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పటికే కెసిఆర్ తో చిన్నపాటి అవగాహన ఉంది. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. చంద్రబాబును నిత్యం రాజకీయంగా వ్యతిరేకిస్తుంటారు కెసిఆర్. అలా కెసిఆర్ కు దగ్గర అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఎదిగేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దోహద పడింది. తెలంగాణలో కార్యకలాపాలు తగ్గించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇచ్చాయి. రెండోసారి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో జగన్మోహన్ రెడ్డికి సాయం చేయడం ప్రారంభించారు. అలా ఆ రెండు పార్టీలు పరస్పర రాజకీయ ప్రయోజనాలతో ముందుకు వెళ్లాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ దెబ్బతిన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. అయితే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ చేయాల్సిన అనివార్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది.
Also Read: బయటకు వెళ్లొచ్చు.. ఆ ఇద్దరు నేతలకు జగన్ షాక్!
రెడ్డి సామాజిక వర్గంలో చీలిక..
ప్రస్తుతం తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గమంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళింది. అయితే సెటిలర్స్ రూపంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం మాత్రం గులాబీ బాస్కు అండగా నిలిచింది. అయితే రెడ్డి సామాజిక వర్గమంతా ఇప్పుడు రేవంత్ చేతిలో ఉండడంతో దానిని విచ్చిన్నం చేసేందుకు జగన్ పార్టీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా రెడ్డి సామాజిక వర్గంలో చీలికకు జగన్ ద్వారా ప్రయోగిస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇస్తే రెడ్డి సామాజిక వర్గంలో ఒక రకమైన మార్పు ఖాయం. కెసిఆర్ పై ద్వేషంతో రెడ్డి సామాజిక వర్గమంతా ఏకమై రేవంత్ రెడ్డికి అండగా ఉంది. దానిని వేరు చేసేందుకు కేసిఆర్ చేసిన ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ద్వారా రెడ్డి సామాజిక వర్గంలో చీలిక తేవాలని కేసిఆర్ భావిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.