Homeక్రైమ్‌Hyderabad Drunken Drive Fraud Case: ప్లేట్ ఫిరాయించడం అంటే ఇదా.. వీడి తెలివికి పోలీసులు...

Hyderabad Drunken Drive Fraud Case: ప్లేట్ ఫిరాయించడం అంటే ఇదా.. వీడి తెలివికి పోలీసులు బిత్తర పోయారు పో..

Hyderabad Drunken Drive Fraud Case: అక్రమార్కులను.. దుర్మార్గులను.. మోసగాళ్లను ఇలా ఎంతోమందిని పోలీసులు జైలుకు పంపించి ఉంటారు. వారు చేసే అన్యాయాల మీద ఉక్కు పాదం మోపి ఉంటారు. కానీ ఈ తరహా మోసాన్ని ఎన్నడూ చూసి ఉండరు. కనీసం సినిమాల్లో కూడా వాళ్లు ఎరిగి ఉండరు. ఎందుకంటే మోసంలో ఇతడు పీహెచ్డీ కాదు, అంతకుమించి చేశాడు. తన నరనరంలో మోసాన్ని జీర్ణించుకున్నాడు. చివరికి పోలీసులను బురిడీ కొట్టించబోయి.. లాస్ట్ మినిట్ లో దొరికాడు.

హైదరాబాద్ నగరంలో సాయంత్రం దాటితే చాలు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడతారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఖరీదైన ప్రాంతాలలో రాత్రిపూట విస్తృతంగా తనిఖీలు చేపడతారు.. తాగుబోతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. భారీ తాగుబోతులకు జరిమానా విధిస్తారు. అంతకుమించితే వాహనాలను సీజ్ చేసి.. కోర్టుకి ఈడుస్తారు. ఇది రొటీన్ ప్రక్రియ. డ్రంకెన్ డ్రైవ్ లో ఎంతటి తోపులైనా సరే దొరికి పోవాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ పోలీసులు వేసే స్కెచ్ చాలా ఉంటుంది మరి. కానీ ఇతడు ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించాడు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారు అతివేగంగా వచ్చింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని ఆపారు. దాని నడుపుతున్న వ్యక్తిని పరీక్షించారు. ఈలోగా పోలీసులు మరో వ్యక్తి వాహనాన్ని ఆపారు. అతడిని తనిఖీ చేస్తుండగా.. ఈ కారు నెంబర్ ప్లేట్ మారడాన్ని గమనించారు. ఒకసారిగా పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇలా ఎలా జరుగుతుందంటూ తమలో తామే ప్రశ్నించుకున్నారు. చివరికి ఆ కారులో ఉన్న వ్యక్తిని కిందికి దింపి.. నెంబర్ ప్లేట్ మార్చే విధానాన్ని చూసి ఒకరకంగా షాక్ గురయ్యారు.

అతడి మోసాన్ని గ్రహించిన పోలీసులు కిందికి దింపి.. అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాన్ని సీజ్ చేశారు. అంతేకాదు అందులో ఉన్న టెక్నాలజీ.. పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు తెలంగాణ పోలీస్ చరిత్రలోనే ఇటువంటి సంఘటన జరగలేదని తెలుస్తోంది. చలాన్ తప్పించుకునేందుకు.. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోతే పోలీసులకు పట్టు పడకుండా ఉండడానికి అతడు ఈ మోసానికి తెరలేపినట్టు తెలుస్తోంది. నెంబర్ ప్లేట్ మార్చడానికి అతడు ప్రత్యేకంగా పరికరాలను సమకూర్చుకున్నాడు. దీనికోసం భారీగానే ఖర్చు పెట్టాడు. ఇంత ఖర్చు పెట్టే బదులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే బాగుంటుంది కదా అని నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular