Homeఎంటర్టైన్మెంట్Asha Bhosle Lifestyle Indian Tradition: అందమైన బొట్టు.. అద్భుతమైన కట్టు.. జడలో నిండుగా మల్లెలు.....

Asha Bhosle Lifestyle Indian Tradition: అందమైన బొట్టు.. అద్భుతమైన కట్టు.. జడలో నిండుగా మల్లెలు.. ఆశా భోంస్లే గాయనే కాదు.. సిసలైన భారతీయురాలు

Asha Bhosle Lifestyle Indian Tradition: బెనారస్ చీర.. థానే మల్లెపూలు.. కాశ్మీరీ కుంకుమ.. ఇవి నిత్యం ఆమె ధరించేవారు. ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే.. ఇంకా ఎన్ని అవరోధాలు వచ్చినా సరే.. వీటిని ధరించడం మానేసేవారు కాదు. చీరను తన ఆత్మస్థైర్యానికి.. మల్లెపూలను తన అందానికి.. కుంకుమను తన ఆత్మాభిమానానికి ప్రతీకలుగా చెప్పుకునేవారు.. అందువల్లే ఆమెను నిజమైన భారతీయురాలు అని పిలిచేవారు. ఇంతకీ ఆమె మరెవరో కాదు దిగ్గజ గాయని ఆశా భోంస్లే. మహారాష్ట్రలో సాంగ్లి […]

Asha Bhosle Lifestyle Indian Tradition: బెనారస్ చీర.. థానే మల్లెపూలు.. కాశ్మీరీ కుంకుమ.. ఇవి నిత్యం ఆమె ధరించేవారు. ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే.. ఇంకా ఎన్ని అవరోధాలు వచ్చినా సరే.. వీటిని ధరించడం మానేసేవారు కాదు. చీరను తన ఆత్మస్థైర్యానికి.. మల్లెపూలను తన అందానికి.. కుంకుమను తన ఆత్మాభిమానానికి ప్రతీకలుగా చెప్పుకునేవారు.. అందువల్లే ఆమెను నిజమైన భారతీయురాలు అని పిలిచేవారు. ఇంతకీ ఆమె మరెవరో కాదు దిగ్గజ గాయని ఆశా భోంస్లే.

మహారాష్ట్రలో సాంగ్లి కుటుంబంలో జన్మించిన ఆశకు.. మొదటినుంచి కూడా పాటలంటే చాలా ఇష్టం. తండ్రి చనిపోయిన తర్వాత.. కుటుంబ భారాన్ని అక్క లత మోస్తున్న నేపథ్యంలో.. ఆమెకు చేదోడు వాదోడుగా ఉండడానికి ఆశ పాటల ప్రయాణం మొదలుపెట్టింది. తన గొంతు మీద అనేక రకాలుగా ప్రయోగాలు చేసుకుంది. గొప్ప గొప్ప వాళ్ళకు సాధ్యం కాని ఘనతలు మొత్తం అందుకుంది. 14 భాషల్లో.. 12వేలకు పైగా పాటలు పాడింది. కెరియర్ తొలి రోజుల్లో అవకాశాలు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. అయినప్పటికీ తనమీద తాను నమ్మకం కోల్పోలేదు. తీవ్రంగా ప్రయత్నించి.. చివరికి అనుకున్నది సాధించింది. తన అక్క లతా మంగేష్కర్ గొప్ప గాయకురాలు అయినప్పటికీ.. తన కెరియర్ కోసం ఆమె పేరు ఎన్నడూ వాడుకోలేదు.

ఆశ పేదరికంలో ఉన్నప్పుడు.. డబ్బు కలిగినప్పుడు.. అంతకు మించిన హోదా దక్కినప్పుడు.. ఇలా జీవితంలో ప్రతి సందర్భంలోనూ తన అసలైన రూపాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. మొదటినుంచి కూడా ఆమెకు చీరలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బెనారస్ చీరలను ప్రత్యేకంగా నేయించి తెచ్చుకునేవారు. గులాబీ రంగును.. బంగారు వర్ణాన్ని విపరీతంగా ఇష్టపడేవారు.. థానే ప్రాంతంలో లభించే మల్లెపూలను ఇష్టంగా ధరించేవారు. కాశ్మీర్ కుంకుమను ప్రత్యేకంగా తెప్పించుకొని తన ముఖారవిందాన్ని మరింత రెట్టింపు చేసుకునేవారు. భారతీయతను విపరీతంగా ఇష్టపడేవారు. ఆధునిక వస్త్రధారణ పట్ల ఆమెకు మొదటి నుంచి కూడా ఒకరకమైన విముఖత ఉండేది.

చాలామంది సింగర్స్ గొంతు బాగా రావడానికి మిర్యాల రసం తాగుతుంటారు. కానీ ఆశకు అలాంటి పట్టింపులు ఉండేవి కాదు. కాకపోతే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండేవారు. సంప్రదాయ పంటలను ఇష్టపడేవారు. అవసరమైతేనే బయట తినేవారు. లేకపోతే తానే స్వయంగా వండుకొని క్యారియర్ తెచ్చుకునేవారు. తను తినడం మాత్రమే కాకుండా.. తోటి గాయకులకు కూడా పెట్టేవారు. కాలా దాల్ ను ఇష్టపడేవారు. బాలీవుడ్లో ఎంతోమంది ప్రముఖులకు స్వయంగా వండిపెట్టి.. అన్నపూర్ణగా నిలిచారు ఆశ. ఎక్కడో మహారాష్ట్రలో మామూలు కుటుంబంలో పుట్టిన ఆశ.. జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రేమించినవాడు కాదు పొమ్మన్నాడు. అత్తింటి వారు ఇబ్బంది పెట్టారు. ముగ్గురు పిల్లల బాధ్యతను భర్తకు వదిలేయకుండా తనే చూసుకున్నారు. మలి ప్రేమను స్వాగతించారు. బర్మన్ తో రెండవ జీవితాన్ని గుండెల నిండా ఆస్వాదించారు. చివరికి శ్వాస సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఆశ భౌతికంగా లేకపోవచ్చు. ఆమె పాటలు అజరామారం. ఆమెగాత్రం ఆ చంద్ర తారార్కం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper