spot_img
Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay

సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో లేఖ రాశారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అర్హులకు 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ 5 పేజీల బహిరంగ లేఖ రాశారు. దళితులు సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అర్హులకు 10 లక్షల ఆర్ధిక సహాయం అందించాలి  అన్నారు.
దళితులకు మంత్రి వర్గంలో తగిన ప్రాధాన్యత కెసిఆర్ ఇవ్వడం లేదని ఆరోపించిన బండి సంజయ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా దళితులకు తెరాస పార్టీ , ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ప్రతీ ఒక్క హామీ నెరవేర్చాలి  డిమాండ్ చేశారు.

మాల సామాజికి వర్గంకు మంత్రి వర్గంలో స్థానం ఇస్తే మాదిగ సామజిక వర్గం కు ఇవ్వకుండా దళితులను కెసిఆర్ మోసగిస్తున్నారు – బండి సంజయ్  మాదిగ , మాల సామాజిక వర్గాల ఆత్మ గౌరవ భవనాలకు భూమి ఎప్పుడు కేటాయిస్తారు అన్ని ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు, అంబేద్కర్ టవర్స్ కు అయిదు సంవత్సరాలు క్రితం శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని అన్నారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడు సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఫార్మ్ హౌస్ , ప్రగతి భవన్ దాటి బయటకు వచ్చి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు దండ వేయ్యలేదు.  దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను అన్ని దళితులను కెసిఆర్ నిట్టనిలువునా మోసగించారని అన్నారు.  దళితులకు , గిరిజనులకు మూడు ఎకరాలు భూమి ఇవ్వలిసిందే అన్నారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మల్లించి దళితులకు కెసిఆర్ ద్రోహం చేస్తున్నారు.

ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను స్వతంత్ర నోడెల్ ఏజెన్సీ ద్వారా ఖర్చు చెయ్యాలని డీమాండ్ చేశారు. యస్సీ కార్పొరేషన్ రుణాలు కోసం లక్షల మంది దళిత యువతీ , యువకులు ఎదురుచూస్తున్నారు , వారికీ వెంటనే రుణ సదుపాయం కలిపించాలని కోరారు. ఎస్సీ , ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని కోరారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...
Oktelugu Epaper