మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ సినిమాల షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. అయినా ఈ సీనియర్ హీరోలు మాత్రం ఇంకా తమ చిత్రాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించలేదు. దసరా బరిలో ఉండాల్సిన ఈ చిత్రాలు రిలీజ్ డేట్ కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ డేట్ బెటర్ అని మెగాస్టార్ టీమ్ ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెబుతున్నా.. అసలు మ్యాటర్ వేరు.

ఇక బాలయ్య సినిమా సంగతి కూడా అలాగే ఉంది. పక్కాగా లెక్కలు వేసుకున్నాకే ముఖ్యంగా ఏ సినిమా పోటీ లేని సమయంలోనే బాలయ్య సినిమాని రిలీజ్ చేయాలని మొదటి నుంచి అఖండ టీమ్ భారీ ఎత్తున కసరత్తులు చేస్తూ వస్తోంది. అందుకే, విడుదల తేదీని ప్రకటించడానికి వాళ్ళు ఆసక్తిగా లేరు. పెద్ద సినిమాలు రేసులో లేని టైం చూసి అఖండను వదులుతారు.
పోటీ లేకపోతే.. అఖండ బాక్సాఫీస్ ను దున్నేస్తాడని బోయపాటి చెబుతున్నాడట. అంటే.. పోటీ ఉంటే.. అఖండ గెలవడం కష్టం అన్నమాట. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు, సెకండ్ షోల పునరుద్ధరణ వంటి అంశాల పై ఇప్పట్లో స్పష్టత రావడం దాదాపు అసాధ్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ స్పీచ్ జగన్ ప్రభుత్వం ఇగోని హర్ట్ చేసింది అంటున్నారు.
కాబట్టి.. పెద్ద సినిమాలకు మేలు చేసేలా ఎట్టిపరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం సానుకూలంగా ఉండదు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజం అయితే.. సంక్రాంతి బరిలోకి రానున్న మహేష్, ప్రభాస్, బన్నీ సినిమాలకు కూడా భారీ నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి.. టికెట్ల రేట్లు పెరిగే అవకాశం లేకపోతే రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా పోస్ట్ ఫోన్ అవుతాయి.
ఒక స్టార్ హీరో సినిమా బిజినెస్ టార్గెట్ 100 కోట్ల పైనే ఉంటుంది. ఆ రేంజ్ లో కలెక్షన్స్ ను కలెక్ట్ చేయాలి అంటే.. టికెట్ రేట్లను రెట్టింపు చేయాలి. అప్పుడే ఏ హీరో అయినా వంద కోట్ల మార్కెట్ ను అందుకోగలరు. లేదంటే.. 60 కోట్లకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. అప్పుడు హీరోల రెమ్యునరేషన్ మళ్ళీ 10 కోట్లకు పడిపోతుంది.