WhatsApp New Feature: ప్రస్తుత కాలంలో WhatsApp use చేయని వారు అంటూ లేరు. స్కూల్ విద్యార్థుల నుంచి పెద్దపెద్ద వ్యాపారులు సైతం వాట్సాప్ పైనే ఆధారపడేవారు ఉన్నారు. అయితే వినియోగదారుల అవసరాలను బట్టి వాట్సాప్ మాతృ సంస్థ ఎప్పటికప్పుడు ఈ యాప్ ను అప్డేట్ చేస్తూ అలరిస్తుంది. ఒకప్పుడు కేవలం మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు మాత్రమే పంపించుకునే అవకాశం ఉండే ఈ యాప్ లో ఇప్పుడు వీడియో కాలింగ్ తో పాటు అన్ని రకాల మనీ ట్రాన్సాక్షన్ కు కూడా అవకాశం ఉంటుంది. అయితే వాట్సాప్ లో చాలామంది ఉపయోగించేది స్టేటస్. తమ ప్రస్తుత పరిస్థితిని తెలుపుతూ చాలామంది స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ స్టేటస్ విషయంలో వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. నీ ఫీచర్ ఎలా ఉంటుందంటే?
Also Read: ఏఐ విప్లవం.. ఉద్యోగ భద్రతపై నీలినీడలు..!
What’s App లో స్టేటస్ పెట్టుకోవాలని చాలామంది ఉత్సాహం చూపుతూ ఉంటారు. కొందరు బర్త్డే సంబంధించి.. మరికొందరు విహారయాత్రలకు వెళ్లిన పరిస్థితి గురించి తెలుపుకునేందుకు స్టేటస్ పెడుతూ ఉంటారు. అయితే ఈ స్టేటస్ తమకు సంబంధించిన కాంటాక్ట్స్ నెంబర్స్ కు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అయితే కాంటాక్ట్ నెంబర్స్ కు మాత్రమే కాకుండా పబ్లిక్ కూడా కనిపించే విధంగా సెట్ చేసుకోవచ్చు. కానీ చాలామంది ప్రేవైసీ కోరుకుంటారు కాబట్టి కాంటాక్ట్ నెంబర్స్ కు మాత్రమే కనిపించేలా సెట్ చేసుకుంటారు.
అయితే ఈ విషయంలో వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాము ఏర్పాటు చేసుకుని స్టేటస్ ను కొందరికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. అంటే కొందరు తమకు నచ్చని వారు ముందే చూడకుండా చివరిలో చూడాలని అనుకుంటారు. దాదాపు స్టేటస్ పెట్టిన తర్వాత చాలామంది దానిని చూడడానికి ఇష్టపడతారు. అయితే నచ్చని వారు లాస్ట్ సీన్ గా ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే దీనిని ఎలా సెట్ చేసుకోవాలంటే?
వాట్సాప్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై టిక్ చేయాలి. అలా చేసిన తర్వాత మై కాంటాక్ట్ అండ్ ఎక్స్పెక్ట్ అనే ఆప్షన్ బై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు కావాల్సిన వారు ముందుగా చూసేలా.. నచ్చని వారు లాస్ట్ చూసేలా సెట్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీకు నచ్చని వారు లాస్ట్ సీన్ ఆప్షన్ పై మూవ్ అవుతుంది.
ఈ ఫీచర్ కొందరికి ఉపయోగపడుతుందని మాతృ సంస్థ మెటా తెలిపింది. అందువల్ల కావాల్సినవారు దీనిని సెట్ చేసుకోవాలని వాట్సప్ పేర్కొంటుంది. అయితే స్టేటస్ పెట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కొందరు సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. స్టేటస్ విషయంలో చాలామంది అవసరం లేనివి వాటికంటే అవసరం ఉన్నవి వాటిని పెట్టుకోవడం వల్ల కమ్యూనికేషన్ దెబ్బతిన్నకుండా ఉంటుందని చెబుతున్నారు.
Also Read: గూగుల్ ఆధిపత్యానికి చెక్.. సీసీఐ కీలక నిర్ణయం..