WhatsApp Logout Feature : యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఎక్కువ శాతం మంది ఈ వాట్సాప్‌ను వాడటం వల్ల మెటా ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. చాలా మంది ఆఫీసు, పర్సనల్ ఇలా అన్నింటి కోసం వాట్సాప్ వాడుతున్నారు. అసలు వాట్సాప్ పనిచేయకపోతే మాత్రం ప్రపంచమే ఆగిపోతుంది. ఈ మెసేజింగ్ యాప్ వల్ల ప్రతీ విషయాన్ని కొన్ని సెకన్లలోనే చేరవేస్తుంటారు. అయితే వినియోగదారులకు ఉపయోగపడే విధంగానే మెటా ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. కొత్త ఫీచర్లు మెటా తీసుకురావడంతో వాట్సాప్ వాడే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుంది. ఇప్పుడు యూజర్ల కోసం లాగౌట్ అనే ఫీచర్‌ను తర్వలో తీసుకురానుంది. అయితే ఈ ఫీచర్ ఏంటి? దీనివల్ల యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Also Read : బి–2 స్పిరిట్: అమెరికా అదృశ్య యుద్ధ విమానం..స్టెల్త్ టెక్నాలజీ చిహ్నం!
ఈ లాగౌట్ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యూజర్లు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయకుండా లేదా చాట్ హిస్టరీని డిలీట్ చేయకుండానే లాగౌట్ కావచ్చు. అయితే ఆండ్రాయిడ్ అథారిటీ, టెక్ టిప్‌స్టర్ అసెంబుల్‌డీబగ్‌లో కూడా దీని గురించి వివరించారు. అయితే లేటెస్ట్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.25.17.37లో అయితే ఇది కనిపించిందట. అయితే ప్రస్తుతానికి ఇది ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే యాప్‌ను యూజర్లకు ఇంకా బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే మీరు వాట్సాప్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలంటే మాత్రం యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. లేదా అకౌంట్‌ను డిలీట్ చేయాలి. అయితే ఇలా చేస్తే మీ డేటా అంతా కూడా పోతుంది. అదే ఈ లాగౌట్ ఫీచర్ వల్ల అయితే మీరు ఏం చేయకుండా అకౌంట్‌ను బ్రేక్ తీసుకోవచ్చు దీనివల్ల మీ చాట్స్, మీడియా, సెట్టింగ్స్ అన్ని కూడా ఏం కావు. మీకు కావాల్సిన డేటా అంతా కూడా అలాగే ఉంటుంది. మళ్లీ కూడా మీరు లాగిన్ చేసుకోవచ్చు. కేవలం టెంపరరీగా మాత్రమే మీరు వాట్సాప్ నుంచి బ్రేక్ తీసుకోవచ్చు.
ప్రస్తుతం వాట్సాప్‌లో ఆల్ ఆర్ నథింగ్ పాలసీ ఫాలో ఉంది. అయితే దీనివల్ల చాలా మంది యూజర్లకు ఇబ్బంది వస్తుంది. వీరు వాట్సాప్ వాడాలంటే యూజర్లు తప్పకుండా యాప్‌ను యాక్టివ్‌గా ఉంచాలి. లేకపోతే అకౌంట్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం లేదా ఇనాక్టివ్ చేస్తే చాట్ హిస్టరీ మిస్ అవుతుంది. అయితే కొత్త లాగౌట్ ఆప్షన్‌తో వాట్సాప్ టెలిగ్రామ్, సిగ్నల్‌కి ఈక్వల్ కానుంది. ఈ యాప్‌లలో ఇప్పటికే యూజర్లు తాత్కాలికంగా సైన్ అవుట్ అయ్యే ఆప్షన్ ఉంది. అయితే ఎక్కువ అకౌంట్ల వాడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా ఎప్పుడు వస్తుందనే విషయాన్ని వెల్లడించలేదు. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.