Oppo colour OS 17: మనదేశంలో ఒప్పో కంపెనీకి తిరుగులేని మార్కెట్ ఉంది. బడ్జెట్.. ప్రీమియం ఫోన్లను ఈ కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా జెన్ జెడ్ ఈ ఫోన్లను విపరీతంగా ఇష్టపడుతుంది. ప్రతి ఏడాది కొత్త ఫోన్లను ఈ కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. మార్కెట్లో నిత్యం కొత్త మోడల్స్ తో యూజర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ కంపెనీ తయారు చేస్తున్న ఫోన్ లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. అది కాస్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ మొత్తాన్ని షేక్ చేస్తోంది.
Colour OS 17 ప్రత్యేకతలు ఏంటంటే..
మరింత ఆకర్షణీయమైన ట్రాన్స్ లూసెంట్ ఇంటర్ ఫేస్. కొత్త యానిమేషన్లు.. వేగంగా స్పందించే టచ్ అనుభూతి.. లాక్ స్క్రీన్ లో కొత్త డిజైన్. ఫోటోలు.. నోట్స్.. ప్రదేశాలు వంటి సమాచారాన్ని ఒకే చోట సేకరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. ఫోటోలను ఎడిట్ చేయడానికి ఏఐ సపోర్ట్ చేస్తుంది. లైటింగ్.. కలర్ టోన్.. కంపోజిషన్ వంటి అంశాలను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. A i face swap detection, ఏఐ రూపొందించిన నకిలీ గొంతులను గుర్తించే synthetic voice recognization, AI live interpreter ద్వారా సంభాషణలలో అనువదించుకోవచ్చు. ఒప్పో తెలిపిన వివరాల ప్రకారం కొత్త రండరింగ్ టెక్నాలజీతో యాప్ లాంచింగ్.. ఫోటో లోడింగ్ వేగం.. యాప్ స్థిరత్వం మెరుగుపడతాయి.
ఇది ఏ ఫోన్లకు వర్తిస్తుంది
అక్టోబర్లో విడుదలైన.. Find x9, find X8, Reno 16.
నవంబర్లో విడుదలైన Reno 15, Reno 14 సిరీస్ లు.
డిసెంబర్లో విడుదలైన Reno 13 series.
2027 మొదటి త్రైమాసికం లో Reno 12 సిరీస్ ఫోన్లు..
కొత్త ఫీచర్ల వల్ల ఫోన్ పూర్తిగా మారిపోతుంది. ఫోన్ స్క్రీన్ డిజైన్ కొత్తగా కనిపిస్తుంది. ఐకాన్లు.. నోటిఫికేషన్లు.. యానిమేషన్లు మరింత స్మూత్ గా ఉంటాయి. లాక్ స్క్రీన్ నుంచి హోం స్క్రీన్ కు మారుతున్నప్పుడు కొత్తగా క్లాక్ యానిమేషన్ కనిపిస్తుంది.
ఫోటోలు.. నోట్స్.. సేవ్ చేసుకున్న సమాచారాన్ని ఏ ఐ సహాయంతో ఒకచోట క్రమబద్ధీకరించుకోవచ్చు. అవసరమైన సమాచారాన్ని సులభంగా వెతుక్కోవచ్చు. ఫోటోలతో లైటింగ్.. కలర్.. ముఖ వివరాలు…. కంపోజిషన్ వంటి అంశాలను ఏ ఐ సహాయంతో ఎడిట్ చేసుకోవచ్చు. ఒక చిన్న టెక్స్ట్ ప్రాప్ట్ ఇచ్చి ఫోటోలు మార్చుకోవచ్చు. మనం అడిగిన సమాచారాన్ని గుర్తించి సంబంధిత సమాచారాన్ని అనుసంధానం చేసే పనులను ఏఐ అసిస్టెంట్ సులభతరం చేస్తుంది. ఏఐ ద్వారా మార్చిన లేదా అన్నకిలీ ముఖాలు ఉన్న ఫోటోలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇయర్ బర్డ్స్ సహాయంతో ఇతర భాషల్లో మాట్లాడే వ్యక్తుల సంభాషణలను ఆమోదించుకోవచ్చు. దీనికి oppo Enco X4 లేదా తర్వాతి మోడల్ ఇయర్ బడ్స్ అవసరం.
Oppo OS 17 లో laminar flow engine ఉంది. దీనివల్ల colour OS 16 తో పోలిస్తే ఈ యాప్ లాంచింగ్ స్థిరత్వం 55% వరకు మెరుగుపడింది. ఫోటోలు లోడ్ అయ్యే వేగంలో 50% వరకు మెరుగుదల కనిపించింది. బ్యాక్ గ్రౌండ్లో యాప్స్ నిలిచే సామర్థ్యంలో 25% వరకు పెరుగుదల కనిపించింది.
కలర్ వైఎస్ 17 అప్డేట్ వచ్చినంతమాత్రాన అన్ని ఏఐ ఫీచర్లు రెండు ఫోన్లలో ఒకే విధంగా పని చేయడానికి అవకాశం ఉండదు. ఏఐ మైండ్ స్పేస్ మోడల్.. సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేస్తుంది.. ఏఐ ఫోటో ఏజెంట్ హార్డ్వేర్.. ప్రాంతం ఆధారంగా పనిచేస్తుంది.. ఏఐ పేస్ స్పాప్ డిటెక్షన్ సపోర్టు ఉన్న యాప్స్ లో మాత్రమే పనిచేస్తుంది. AI live interpreter పని చేయాలంటే ఒప్పో ఇయర్ బడ్స్ అత్యంత ముఖ్యం.. సింథటిక్ వాయిస్ రికగ్నైజేషన్ సపోర్టు ఉన్న కాల్స్ లో మాత్రమే పనిచేస్తుంది.
ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అబౌట్ డివైస్ లోకి వెళ్ళాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎంచుకోవాలి. కొత్త అప్డేట్ అందుబాటులో ఉంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనివల్ల అప్డేట్ మనకు అర్థమవుతుంది.