OnePlus Nord N6: ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగం విపరీతంగా ఉంది. దీంతో చాలా మంది బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉన్న ఫోన్ల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉండే ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా Oneplus బ్రాండ్ నుంచి బడ్జెట్ ధరలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో విశేషమేంటంటే.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మూడు రోజుల వరకు వాడుకోవచ్చు. అలాగే పవర్ ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్ ను ఉంచారు. ఇంతకీ ఇది ఏ ఫోన్..? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ కిందికి వెళ్లండి..
వన్‌ప్లస్ నుంచి కొత్త మార్కెట్లోకి నార్డ్ N6 వచ్చింది. ఇందులో 8,000mAh భారీ బ్యాటరీ ఉంచారు. దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ పెట్టి.. సాధారణంగా వాడితే మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనితో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం బ్యాటరీ సామర్థ్యమే కాకుండా, 7 సంవత్సరాల పాటు రోజువారీ వాడకంలోనూ బ్యాటరీ హెల్త్ 80 శాతం పైగా స్థిరంగా ఉండేలా దీనిని రూపొందించారు.
ఈ ఫోన్ లో 6.8 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేయడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. స్క్రీన్ బ్రైట్‌నెస్ 1200 నిట్స్ వరకు ఉండటం వల్ల ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. మల్టీటాస్కింగ్, 5G కనెక్టివిటీ కోసం దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి తోడు 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఫోన్ ఎక్కువ సమయం వాడినా లేదా గేమింగ్ ఆడినా వేడెక్కకుండా ఉండేందుకు దీనిలో భారీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు
ఈఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్‌ను అందించారు సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇది ఆక్సిజన్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో నడుస్తుంది. దీనిలో AI కాల్ సమ్మరీ, సర్కిల్ టు సెర్చ్ వంటి లేటెస్ట్ AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ N6 ధర సుమారు రూ. 18,000 నుంచి రూ. 22,000 మధ్య ఉండే అవకాశం ఉంది. రూ. 20 వేల బడ్జెట్‌లో అదిరిపోయే బ్యాటరీ లైఫ్, నమ్మకమైన వన్‌ప్లస్ బ్రాండింగ్ కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.
