Siri App: ప్రపంచవ్యాప్తంగా Apple మొబైల్స్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అందులోనూ భారత్ లో ఈ ఫోన్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మొబైల్ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా తన వాయిస్ అసిస్టెంట్ Siri ని iOS 27 లో పూర్తిగా మార్చి, ఇప్పుడు స్వతంత్ర యాప్‌గా అందుబాటులోకి తెస్తోంది. ఈ యాప్‌లో టెక్స్ట్, వాయిస్ రెండింటి ద్వారా చాట్ చేయ వచ్చు. గతంలో సిరి కేవలం వాయిస్ కమాండ్‌లకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు గొప్ప చాట్‌బాట్ అనుభవాన్ని ఇవ్వడానికి యాపిల్ ప్రత్యేక యాప్ ని తయారు చేస్తోంది.
బ్లూమ్ బర్గ్ లీక్ చేసిన ఫొటోల ప్రకారం.. కొత్త Siri యాప్ చాట్ హిస్టరీని లిస్ట్ లేదా గ్రిడ్ రూపంలో చూపిస్తుంది. రిచ్‌టెక్స్ట్ కార్డ్‌ల ద్వారా వివరణాత్మక సమాచారాన్ని డైనమిక్ ఇస్లాండ్ నుండి పాప్‌అప్‌గా ఇస్తుంది. ఇంటర్‌ఫేస్ చాలా డార్క్ థీమ్‌లో ఉంటుంది. అలాగే వాయిస్ మోడ్, సాధారణ టెక్స్ట్ ఫీల్డ్, అటాచ్‌మెంట్ పికర్ లాంటి ఫీచర్‌లు ఉంటాయి. ఈ యాప్ ప్రధానంగా ChatGPT, Gemini, Claude లాంటి అప్లికేషన్‌లను పోలి ఉంటుంది.
ఇందులో మెసేజ్‌లు, ఇమెయిల్స్, నోట్స్ లాంటి పర్సనల్ డేటాను అర్థం చేసుకుని కమాండ్స్ ఎక్స్‌క్యూట్ చేస్తుంది. యాప్‌లలో పనులు చేయడం, వెబ్ సెర్చ్ చేయడం, వార్తలను అప్‌డేట్ చేయడం వంటి జటిలమైన టాస్క్‌లను కూడా చేయగలదు. అలాగే, స్క్రీన్ కంటెంట్‌ను అర్థం చేసుకోవడం వంటి ఫీచర్‌లు కూడా ఇందులో ఉంటాయి.
iOS 27 లో యాపిల్ మొదటిసారిగా రెన్యూవల్ ఏఐ మోడల్ ద్వారా రిలీజ్ అవుతుంది. సిస్టమ్ గూగుల్ Gemini టెక్నాలజీని ఉపయోగించి యూజర్లు App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న థర్డ్-పార్టీ AI ఏజెంట్‌లకు ప్రత్యక్షంగా ప్రశ్నలను రౌట్ చేయవచ్చు. అదనంగా సిరీ ఇప్పుడు కెమెరా యాప్‌లో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది . ఫోటో తీసి, దానిని AI ద్వారా చెక్ చేస్తుంది. ఈ కొత్త సిరి ఫీచర్‌లను యాపిల్ జూన్ 8, 2026 నాడు WWDC 2026 కీనోట్‌లో అధికారికంగా ప్రకటించనుంది. తర్వాత బీటా టెస్టింగ్ జరిగి, సెప్టెంబర్ 2026లో iOS 27 విస్తృతంగా రిలీజ్ కానుంది.
