Artificial Intelligence: అల్జీమర్స్ ఉన్న వాళ్లకు జ్ఞాపకశక్తి ఉండదు. పుట్టుకతో మూగ లోపంతో బాధపడే వారికి మాట్లాడే అవకాశం ఉండదు. పార్కిన్ సన్ వంటి వ్యాధితో ఇబ్బంది పడే వారికి తమ బాధను వ్యక్తం చేసే అవకాశం ఉండదు. వీళ్ళు మాత్రమే కాదు.. ఇంకా దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడే వారికి ఇప్పుడు ఉపశమనం లభించింది. అది మందులతో కాదు.. కేవలం సాంకేతిక పరిజ్ఞానంతో..
అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మీద కొంతమంది సానుకూలంగా స్పందిస్తుంటే.. మరి కొంతమంది వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ మార్పును కచ్చితంగా ఆహ్వానించాలి. దానిని సానుకూల కోణంలో చూడాలి. మనిషి అభివృద్ధి కోసం వాడుకోవాలి. అటువంటి వాడుకలో ఎన్నో లాభాలు ఉంటాయి. ఇప్పుడు అటువంటి లాభమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీర్ఘకాలిక రోగులకు లభిస్తోంది.
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల టెక్నాలజీ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో ఇప్పుడే తెలిసిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదట్లో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు సమస్త రంగాలకు విస్తరించింది. అసలు ఇది లేని రంగం అంటూ లేదు. అన్ని పనులు కూడా దీని ద్వారానే జరిగిపోతున్నాయి. హెల్త్ కేర్ నుంచి మొదలు పెడితే ఆటోమొబైల్ వరకు.. ఎలక్ట్రానిక్స్ నుంచి మొదలుపెడితే గూడ్స్ వరకు ఇలా ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే సాగిపోతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త కొత్త టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి సమూల మార్పులకు కారణమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఎన్నో కంపెనీలు సరికొత్త టూల్స్ ను ఆవిష్కరించాయి. ఈ టూల్స్ కూడా అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాయి. అయితే ఓ కంపెనీ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. ఒకరకంగా దీనిని వ్యవస్థ అని చెప్పవచ్చు.. మెటా అనే కంపెనీ brain to qwerty v2 అనే అత్యాధునికమైన సాంకేతిక వ్యవస్థను రూపొందించింది. దీని ప్రకారం ఇది బ్రెయిన్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. బ్రెయిన్ యాక్టివిటీని మొత్తం టెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది.
ఈ టెక్నాలజీ వల్ల మాట్లాడలేని స్థితిలో ఉన్నవారు.. మైండ్ లో ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. సర్జరీ ఇంప్లాంట్స్ అవసరం లేకుండానే మాగ్నటో ఎన్సోఫలోగ్రఫీ, నాన్ ఇన్వెసివ్ రికార్డింగ్ ద్వారా ఈ వ్యవస్థ మొత్తం బ్రెయిన్ లాంగ్వేజ్ మొత్తాన్ని ఢీకోడ్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో ట్రయల్స్ నిర్వహించగా ఏకంగా 78% అక్యురసీ వచ్చింది. దీనిని బట్టి ఈ కొత్త సిస్టం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
మెదడులో ఉన్న మాటను వెంటనే చెప్పడం ద్వారా ఈ టెక్నాలజీ భవిష్యత్ కాలంలో ఎన్నో మార్పులకు నాంది పలుకుతుందని.. ముఖ్యంగా మాట్లాడలేని వాళ్లకు.. మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఇది ఉపయోగంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే నూటికి నూరు శాతం అక్యురసీ సాధించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.
మెదడులో ఉన్న మాటలను ఈ వ్యాధులతో బాధపడేవారు వ్యక్తం చేయవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా తమ మాటలను… తమ భావాలను బయట పెట్టొచ్చు. అంతేకాదు.. ఇలా మాట్లాడే అవకాశం ద్వారా వారి మెదడు కూడా చైతన్యవంతమవుతుంది. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకుంటుంది. అంతేకాదు ఉత్తేజితంగా మారి వ్యాధి తీవ్రతను తగ్గించుకుంటుంది. మందులతో సాధ్యం కానిది.. క్లిష్టమైన శస్త్ర చికిత్సల వల్ల కానిది.. టెక్నాలజీ వల్ల అవుతోంది. అది కూడా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యమవుతోంది.
