Homeక్రీడలుక్రికెట్‌Women T20 World Cup 2026: నేటి నుంచి ఉమెన్స్ టి20 వరల్డ్ కప్.. ఎందులో...

Women T20 World Cup 2026: నేటి నుంచి ఉమెన్స్ టి20 వరల్డ్ కప్.. ఎందులో చూడొచ్చు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం

Women T20 World Cup 2026: నేటి నుంచి మహిళల టి20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతోంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ టోర్నీ కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ శ్రీలంకతో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ కంటే ముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటల నుంచి పది గంటల 40 నిమిషాల వరకు ప్రారంభ కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 11 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. పొట్టి ప్రపంచకప్ కోసం దాదాపు 12 జట్లు పోటీ […]

Women T20 World Cup 2026: నేటి నుంచి మహిళల టి20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతోంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ టోర్నీ కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ శ్రీలంకతో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ కంటే ముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటల నుంచి పది గంటల 40 నిమిషాల వరకు ప్రారంభ కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 11 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

పొట్టి ప్రపంచకప్ కోసం దాదాపు 12 జట్లు పోటీ పడుతున్నాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ వన్ లో భారత్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ 2 లో స్కాట్లాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఐర్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీ మొత్తం రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో జరుగుతుంది. ప్రతి గ్రూపులో జట్టు మిగిలిన ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం ఆయా గ్రూపులలో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సెమీస్ వెళ్ళిపోతాయి. లీగ్ స్టేజ్లో 30 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఫస్ట్ సెమి ఫైనల్ మ్యాచ్ జూన్ 30న.. రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జూలై 2న జరుగుతాయి. జూలై 5న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు, ఇంగ్లాండ్ ఒకసారి, వెస్టిండీస్ ఒకసారి, న్యూజిలాండ్ ఒకసారి పొట్టి ప్రపంచ కప్ అందుకున్నాయి. మా దేశం ఇప్పటివరకు ఒకసారి కూడా t20 వరల్డ్ కప్ అందుకోలేదు. మరోవైపు ఈ టూర్ ని బ్రాడ్ కాస్ట్ రైట్స్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. ఈ మ్యాచ్ లు మొత్తం టీవీలలో స్టార్ స్పోర్ట్స్ చానల్స్ లో వీక్షించవచ్చు.. ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడొచ్చు.. భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 14న పాకిస్తాన్ తో ఆడుతుంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఇటీవల భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించింది. సెమీస్ లో ఆసీస్ ను మట్టి కరిపించింది. ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించింది. తొలిసారి వన్డే వరల్డ్ కప్ అందుకుంది. తద్వారా సరికొత్త చరిత్ర నెలకొల్పింది. ఈసారి కూడా భారత మహిళలు అదే ఘనతను రిపీట్ చేయాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper