Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi G V Prakash Viral Video: మ్యూజిక్ డైరెక్టర్ ను పాతిపెట్టిన అనిల్...

Anil Ravipudi G V Prakash Viral Video: మ్యూజిక్ డైరెక్టర్ ను పాతిపెట్టిన అనిల్ రావిపూడి.. ఇదేం ప్రమోషన్ సామి.. వీడియో వైరల్..

Anil Ravipudi G V Prakash Viral Video: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు రాజమౌళి వరుసగా 12 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక అతని తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి 9 విజయాలను సాధించి తన కంటు ఒక క్రెడిబులిటి ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో […]

Anil Ravipudi G V Prakash Viral Video: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు రాజమౌళి వరుసగా 12 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక అతని తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి 9 విజయాలను సాధించి తన కంటు ఒక క్రెడిబులిటి ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. మల్టీ స్టారర్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని కూడా తను ఇచ్చాడు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అఫీషియల్ గా ముహూర్తం జరుపుకోబోతుంది. ఇక దానికి ముందే అనిల్ రావిపూడి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు.

మొదటిసారి జీవి ప్రకాష్ తన సినిమాకి సంగీత దర్శకుడుగా తీసుకున్న అనిల్ రావిపూడి అతనితో మంచి ట్యూన్స్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దాని కోసం ఆయన విభిన్నమైన పంథాలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. జంధ్యాల సినిమాలోని సుత్తి వీరభద్ర రావు చెప్పే ఫేమస్ డైలాగులైన హైదరాబాద్, సికింద్రాబాద్ అనేదాన్ని స్ఫూఫ్ గా వాడుకొని జీవి ప్రకాష్ కుమార్ ని ఇసుక లో పాతిపెట్టి మరి అతని చేత మ్యూజిక్ ని చేయించుకుంటున్నాడు.

అతనితోపాటు ఆ సాంగ్ కి లిరిక్ రైటర్ గా వ్యవహరిస్తున్న అనంత శ్రీరామ్ ను సైతం ఇసుకలో పాతి పెట్టడం విశేషం… మొత్తానికైతే తను మ్యూజిక్ సిట్టింగ్ కోసం సంగీత దర్శకుడిని పట్టుబట్టి మరి వారి చేత మంచి మ్యూజిక్ ను ఇప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.

దానికి దీన్ని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇక అనిల్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు అంటూ ఆయన పెట్టిన వీడియోలు లో సోషల్ మీడియాలో విపరీతంగా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి… ఇక ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే ఆయన వరుసగా 10 విజయాలను అందుకున్న దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడు…లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper