Homeఎంటర్టైన్మెంట్Nagarjuna entering distribution field: నాగార్జున డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ ముగ్గురికి చెక్...

Nagarjuna entering distribution field: నాగార్జున డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ ముగ్గురికి చెక్ పెడుతున్నాడా..?

Nagarjuna entering distribution field: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేస్తున్న సినిమాల మీద దర్శకులు చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి పోటీని ఇచ్చే రేంజ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదిగింది. కాబట్టి ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించి మనకంటూ ఒక ఐడెంటిటి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మన దర్శక నిర్మాతలు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్ల చేతిలో థియేటర్లు ఉన్నాయి అనే వాదనలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లుగా మారి లేదంటే వాళ్లు ప్రొడ్యూస్ చేసిన సినిమాలను రిలీజ్ చేసుకుని వాళ్ళ థియేటర్లలో ఆడిస్తున్నారు. దీనివల్ల ఇతర సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. మరి ఎందుకని ఇలా జరుగుతుంది. కేవలం కొంతమంది ప్రొడ్యూసర్ల చేతుల్లోనే సినిమా ఇండస్ట్రీ ఉందా? డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా వాళ్లే రాణిస్తున్నారా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తానికైతే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నాగార్జున సైతం డిస్ట్రిబ్యూషన్ హౌస్ ని స్టార్ట్ చేశాడు.

ఇకమీదట భారీ సినిమాలను తన డిస్ట్రిబ్యూషన్ హౌస్ నుంచి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో నాగార్జున ఉన్నాడు.
ఇక దీనివల్ల అటు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి వారికి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్లే ప్రొడ్యూసర్లుగా డిస్ట్రిబ్యూటర్లుగా చలామణి అవుతున్నారు.

కాబట్టి వాళ్లకు ఎంతో కొంత డ్యామేజ్ జరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ ముగ్గురికి దాదాపు 200 థియేటర్ల వరకు ఉన్నాయి. వాళ్ల సినిమాలు రిలీజైతే ఒకరి ఒకరు హెల్ప్ చేసుకొని వాళ్ల సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చిన్న సినిమాలకు సైతం ఇబ్బంది ఎదురవుతుంది.

మరి ఆ గుత్తాధిపత్యాన్ని తొలగించాలంటే మరికొంతమంది డిస్ట్రిబ్యూటర్లుగా మారాల్సిన అవసరమైతే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఎంత ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ లు పెరిగితే సినిమాల మధ్య అంత పోటీ పెరిగే అవకాశం ఉంది… దాని వల్ల ప్రతి సినిమాకి ఎక్కువ మొత్తంలో బిజినెస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper