spot_img
Homeక్రీడలుక్రికెట్‌SRH vs KKR: "హెడ్" ఏక్ కాదు.. మైగ్రేనే.. కోల్ కతా ను ఇలా...

SRH vs KKR: “హెడ్” ఏక్ కాదు.. మైగ్రేనే.. కోల్ కతా ను ఇలా తగులుకున్నాడు..

SRH vs KKR: ఐపీఎల్ లో ఇప్పటికే హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. వరుసగా ఐదు విజయాలు సాధించింది. మొత్తంగా ఆరు విజయాలతో అదరగొడుతోంది. బ్యాటింగ్ పరంగా సూపర్ ఫామ్ లో ఉంది. బౌలింగ్ పరంగా కూడా అదే స్థాయిలో జోరు కొనసాగిస్తోంది. దీంతో హైదరాబాద్ జట్టు మీద ఈసారి అంచనాలు పెరిగిపోయాయి. ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా వరుసగా ఐదు విజయాలు సాధించి.. ప్రత్యర్థులకు గట్టి సంకేతాలు పంపింది హైదరాబాద్ జట్టు.

హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు సాధించిన విజయాలలో భీకరంగా బ్యాటింగ్ చేసింది అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్. ఇంతవరకు భీకరమైన ఓపెనర్ హెడ్ తన స్టైల్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడలేదు. వాస్తవానికి ముంబై తో జరిగే మ్యాచ్ కంటే ముందు హెడ్ అసలు ఫామ్ లోనే లేడు. ఎప్పుడైతే ముంబై జట్టు మీద అతడు టచ్ లోకి వచ్చాడో.. హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడో.. ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.

కాటేరమ్మ కొడుకుగా పేరు సొంతం చేసుకున్న హెడ్ మరోసారి తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరుగుతున్న మ్యాచ్ లో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేశాడు హెడ్.. అభిషేక్ శర్మ (15) విఫలమైనప్పటికీ.. హెడ్ దుమ్మురేపాడు. 25 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 55* పరుగులు చేశాడు హెడ్. తొలి వికెట్ కు అభిషేక్ శర్మతో 44, రెండో వికెట్ కు కిషన్ తో 49* పరుగులు జోడించాడు. ఈ సీజన్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడంతో హెడ్ మీద హైదరాబాద్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు..

” అతడు ఇప్పటివరకు సరైన ఇన్నింగ్స్ ఆడక పోవడం వల్ల ఇబ్బంది పడ్డాం. అతడు ఆడక పోవడంతో మిగతా ప్లేయర్ల మీద ఒత్తిడి పడింది. ఇప్పుడు అతడు ఫామ్ లోకి వచ్చేసాడు. బ్యాక్ టు బ్యాక్ ఆఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. మామూలుగా అయితే వీర విహారం చేసే హెడ్.. ఇప్పుడు అంతకుమించి అనే రేంజ్ లో ఆడుతున్నాడు. ఇదే మాకు కావాల్సింది” అంటూ హైదరాబాద్ అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper