IPL 2025 RCB Captain: ఇటీవల మెగా వేలంలో డూ ప్లె సిస్ ను బెంగళూరు యాజమాన్యం(royal challengers Bengaluru) కొనుగోలు చేయలేదు. డూ ప్లె సిస్(du plessis) గత సీజన్లో బెంగళూరు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే అతడిని తిరిగి కొనుగోలు చేయడానికి లేదా జట్టులో కొనసాగించడానికి యాజమాన్యం సుముఖత వ్యక్తం చేయలేదు. మెగా వేలం జరిగిన తర్వాత బెంగళూరు కెప్టెన్సీ రేస్ లో విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరు వినిపించింది. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ(Virat Kohli) కాకుండా మరొక ఆటగాడి పేరు స్పోర్ట్స్ వర్గాల్లో వినిపిస్తోంది. అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
ఈసాలా కప్ నమదే
ఈసాలా కప్ నమదే అని బెంగళూరు అభిమానులు గట్టిగా ప్రచారం చేస్తున్నారు.. గత 17 సీజన్లలో బెంగళూరు జట్టు మెరుపులు మెరిపిస్తోంది. కానీ లీగ్ సమరం పూర్తయిన తర్వాత ఆ జట్టు చేతులెత్తేస్తోంది. విరాట్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ జట్టు ట్రోఫీలు అందుకోవడం లేదు. ఆయనప్పటికీ బెంగళూరు జట్టు(royal challengers Bengaluru) అగ్రశ్రేణి జట్లతో సమానంగా అభిమాన గణాన్ని సంపాదించుకుంది. చెన్నై, ముంబై, హైదరాబాద్ కు ఉన్నట్టుగానే బెంగళూరుకు(Bangalore) హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ సీజన్లో కోహ్లీ కాకుండా వేరే వ్యక్తిని కెప్టెన్ గా నియమించే అవకాశం ఉన్నట్టు కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే విరాట్ కోహ్లీ(Virat Kohli) కెప్టెన్సీ తీసుకోవడానికి ఆసక్తి చూపించకపోవడంతో.. యువ ఆటగాడు రజత్ పాటిదార్(Rajat Patidar) ను కెప్టెన్ గా నియమిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అతడికి ఇటీవల జరిగిన మెగా వేలంలో 11 కోట్లు పెట్టి బెంగళూరు యాజమాన్యం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
రజత్ పాటిదార్(Rajat Patidar) రికార్డులు ఇవే
రజత్ పాటిదార్(Rajat Patidar) సయ్యద్ ముస్తక్ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ జట్టు ఫైనల్ దాకా తీసుకెళ్లడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సీజన్లో తొమ్మిది ఇన్నింగ్స్ లలో 428 పరుగులు చేసి.. అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాటర్ గా నిలిచాడు.. ఐపీఎల్ లోనూ రజత్ పాటిదార్(Rajat Patidar) 27 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి 799 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఐపీఎల్ లో రజత్ పాటిదార్(Rajat Patidar) హైయెస్ట్ స్కోర్ 112. ఒకవేళ రజత్ పాటిదార్(Rajat Patidar) కాకుండా కృణాల్ పాండ్యా(krunal Pandya) కు బాధ్యతలు అప్పగించే అవకాశం కనిస్తోంది. కృణాల్ పాండ్యా బరోడా కెప్టెన్ గా దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు.