Pakistan : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయన అంతకుముందు ఫ్రాన్స్(France) లో పర్యటించారు. అంతకు ముందు ఆయన విమానం “ఇండియా 1” న్యూఢిల్లీ నుండి పారిస్ ప్రయాణ మార్గంలో పాకిస్తాన్(Pakistan) గగనతలంలో ప్రయాణించింది. సమాచారం ప్రకారం.. ఈ సమయంలో ఇది 46 నిమిషాలు పాకిస్తాన్ గగనతలంలో ఉంది. పాకిస్తాన్ గగనతలం నుండి విమానం బయటకు వెళ్లాలంటే భారతదేశం ఏమైనా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో ఉంది. కారణం పాక్ మనకు బద్ధశత్రువు కాబట్టి అంత తేలికగా భారత్ విమానాలను పోనిస్తుందా అని. ఈ రోజు దీనికి సంబంధించిన నియమాన్ని తెలుసుకుందాం.
ఏంటి విషయం?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra modi) తన పారిస్ పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో ఆఫ్ఘన్ గగనతలం మూసివేయడంతో ప్రధాని మోడీ ప్రయాణించిన విమానం పాకిస్తాన్ సరిహద్దులోకి దాని అనుమతితో ప్రయాణించాల్సి వచ్చింది. ARY న్యూస్ నివేదిక ప్రకారం.. ప్రధాని మోదీ విమానం పాకిస్తాన్‌లోని షేక్‌పురా, హఫీజాబాద్, చక్వాల్, కోహత్ వంటి ప్రాంతాల గుండా ప్రయాణించి దాదాపు 46 నిమిషాల పాటు పాకిస్తాన్ గగనతలంలో ఉంది.
గతంలో కూడా ఇలాగే
దీనికి ముందు కూడా ప్రధాని మోడీ ప్రయాణించిన విమానం పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఆగస్టు 2024లో ఉక్రెయిన్ నుండి ఢిల్లీకి తిరిగి వస్తుందడగా ప్రధాని మోదీ విమానం కూడా పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించింది. ఆ సమయంలో కూడా విమానం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి 46 నిమిషాలు అక్కడే ఉంది.
వైమానిక ప్రాంతానికి సంబంధించిన నియమాలు ఏమిటి?
ముందుగా ఎయిర్‌స్పేస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏ దేశమైనా భూమి, నీటి సరిహద్దుల పైన ఉన్న ఆకాశాన్ని గగనతలం అంటారు. భూమి లాగే, ఆకాశానికి కూడా దాని స్వంత దేశ సరిహద్దులు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ప్రతి దేశానికి దాని గగనతలంపై ప్రత్యేకాధికారాలు ఉన్నాయి. తన గగనతలంలోకి ఏ విమానాన్ని అనుమతించాలి, ఏ విమానాన్ని నిషేధించాలో నిర్ణయించుకునే హక్కు ఆ దేశానికే ఉంటుంది. ఉదాహరణకు.. భారత ప్రభుత్వం, భారత వైమానిక దళం భారత గగనతలంపై ప్రత్యేక నియంత్రణను కలిగి ఉన్నాయి. ఏ విమానమైనా భారత గగనతలంలోకి ప్రవేశించాలంటే వారి అనుమతి తీసుకోవాలి.
గగనతలానికి డబ్బు చెల్లించాలా?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇతర దేశ గగనతలంలోకి ప్రవేశించాలంటే టోల్ ట్యాక్స్ లాగా ఎయిర్ స్పెస్ ట్యాక్స్(Airspace Tax) ఏమైనా ఉంటుందా అంటే అలాంటిది ఏమీ లేదు. ఏ దేశమైనా మరొక దేశ గగనతలాన్ని ఉపయోగించుకోవాలంటే ఆ దేశ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మంచి అంతర్జాతీయ విమాన సేవలను అందించడానికి, ప్రయాణీకుల సౌలభ్యం కోసం అన్ని దేశాలు గగనతలంలో ఒకదానితో ఒకటి సహకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య సంబంధం వైమానిక ప్రాంతం పరంగా కూడా బాగా ప్రభావితమవుతుంది. 2019లో లాగానే పుల్వామా దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే, మార్చి 2019లో పాకిస్తాన్ పౌర విమానాలకు ఈ ఆంక్షలను ఎత్తివేసింది.