India Test Cricket : సుదీర్ఘ ఫార్మాట్ లో టీమిండియా అనేక విజయాలు సాధించింది. అయితే ఈ విజయాలలో ఐదు అతి పెద్దవి ఉన్నాయి. ఈ పెద్ద విజయాలు మొత్తం భారతదేశంలోనే టీమిండియా సాధించడం విశేషం. అయితే ఈ లిస్టులో ఇంగ్లాండ్ జట్టు మీద సాధించిన విజయమే అతిపెద్దదిగా ఉంది. ఇప్పుడు ఈ రికార్డును టీమిండియా మరోసారి బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ భారత్ ఓడిపోయింది. రెండవ టెస్టులో భారీ విజయం సాధించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే ఈ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు లో ఐదు కీలక వికెట్లను భారత్ పడగొట్టింది. ఇంగ్లాండ్ ఎదుట ఆరువందలకు పైగా పరుగుల లక్ష్యాన్ని భారత్ విధించింది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇంగ్లాండ్ తడబడుతోంది. ఈ నేపథ్యంలో భారత బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకవేళ గనుక టీమిండియా బౌలర్లు మిగతా ఐదు వికెట్లు పడగొడతే టీమిండియా అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించింది. అయితే ఇందులో ఐదు భారీ విజయాలు భారత్ వేదికగానే సాధించింది.
2024లో రాజ్ కోట్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత భారీ విజయంగా నమోదయింది. నాడు భారత జట్టు ఇంగ్లాండ్ మీద 434 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
2021లో వాంఖడే మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ 372 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టుకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండవ అతి భారీ విజయం. నాడు కివీస్ జట్టు పై భారత్ 372 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం.
2015లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ 337 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ సౌత్ ఆఫ్రికా మీద ఇంతటి భారీ విజయాన్ని దక్కించుకుంది. భారత జట్టు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది మూడవ అతి భారీ విజయం.
2016లో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 321 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అతి భారీవిజయంగా నమోదయింది. నాడు కివీస్ జట్టుపై భారత్ ఈ గెలుపును సొంతం చేసుకుంది.
2008లో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 320 పరుగుల తేడాతో విజయం సాధించింది. కంగారు జట్టుతో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ 320 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఐదవ అతి భారీ విజయంగా నమోదయింది.